ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సుబ్బయ్య హత్య జరిగినప్పుడు నేను హోమంలో ఉన్నా: మున్సిపల్‌ కమిషనర్‌

By

Published : Dec 31, 2020, 2:07 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య వెనుక ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధ హస్తం ఉందని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఆమె పేరును ఎఫ్​ఐఆర్​లో చేర్చాల్సిందేనని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం డిమాండ్ చేస్తున్నారు. వీటిపై 'ఈటీవీ భారత్​'కు ఇచ్చిన ఇంటర్వూలో ఆమె స్పందించారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

proddatur municipal commissioner
proddatur municipal commissioner

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధతో ముఖాముఖి

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధ తెలిపారు. ఈ కేసులో బాధిత కుటుంబ సభ్యులు తన పేరును అనవసరంగా తెరపైకి తీసుకువచ్చారని ఆమె చెప్పారు. గురువారం ఈటీవీ భారత్​తో ముఖాముఖిలో ఆమె మాట్లాడారు.

కావాలనే సుబ్బయ్య కుటుంబం నాపేరు ప్రస్తావిస్తోంది. సుబ్బయ్య హత్య జరిగినప్పుడు నేను హోమంలో ఉన్నా. ఘటనాస్థలికి సుబ్బయ్య వస్తే కాసేపు ఉండమని మాత్రమే చెప్పా. పూజ అయిపోయాక వస్తానని చెప్పి ఆయన ఫోన్​ మాట్లాడుతూ వెళ్లిపోయారు. కాసేపటికే పెద్దగా అరుపులు వినిపించాయి. నేను వెళ్లి చూసేసరికి ఆయన చనిపోయాడు. ఎవరు చంపారో నేను చూడలేదు. దయచేసి రాజకీయాల్లోకి అధికారులను లాగొద్దు. నందం సుబ్బయ్య హత్యకేసులో ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం- రాధ, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్

ABOUT THE AUTHOR

...view details