ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police Case on Dastagiri: వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

By

Published : Jun 20, 2023, 9:52 AM IST

Updated : Jun 20, 2023, 11:26 AM IST

Police Case on Dastagiri: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్​గా ఉన్న దస్తగిరిపై కేసు నమోదైంది. బాలుడిని నిర్బంధించి హింసించాడని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పు తీసుకొని తిరిగి చెల్లించినా.. మరో లక్ష రూపాయలు కట్టమని వేధిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

Police Case on Dastagiri
దస్తగిరిపై పోలీసు కేసు నమోదైంది

వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

Complaint on Dastagiri: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్​గా ఉన్న దస్తగిరిపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. డబ్బులు బాకీ తీర్చలేదని కారణంతో ఓ బాలుడిని ఇంట్లో నిర్బంధించి హింసించాడని బాలుడు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దస్తగిరి వద్ద కళావతి అనే మహిళ 3 నెలల కిందట 40 వేల రూపాయలు అప్పు తీసుకుంది. తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించినా.. మరో లక్ష రూపాయలకు పైగా చెల్లించాలని దస్తగిరి ఒత్తిడి చేస్తున్నట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అసలు వడ్డీ తీర్చలేదనే కారణంతో సోమవారం మధ్యాహ్నం తన కుమారుడిని దస్తగిరి ఇంటికి తీసుకెళ్లి నిర్బంధించినట్లు బాలుడు తల్లి కళావతి పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి పోలీసులు.. దస్తగిరి ఇంటికి వెళ్లి నిర్బంధించిన బాలుడిని విడిపించి స్టేషన్​కు తీసుకొచ్చారు. అనంతరం పులివెందుల ఆసుపత్రిలో బాలుడికి వైద్య చికిత్సలు అందించారు. వైద్యసేవల అనంతరం బాలుడిని స్టేషన్‌కు తీసుకెళ్తుండగా పోలీసుల వాహనాన్ని బాధితుడి బంధువులు అడ్డుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

Dastagiri Comments: వారిద్దరి నుంచి ఇప్పటికీ ప్రమాదం పొంచి ఉంది: దస్తగిరి

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దస్తగిరి తనను చిత్రహింసలు పెట్టాడని కత్తితో చేయి కోశాడని బాలుడు వెల్లడించారు. ఇదే సమయంలో బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దస్తగిరిని కూడా పోలీసులు స్టేషన్​కు పిలిపించి విచారించారు. దస్తగిరి ఇంటికి వెళ్తున్న సమయంలో బాధితులు ఎదురుపడటంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

పోలీసులు సర్ది చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా దస్తగిరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమకు ఇబ్బంది వస్తే మాత్రం ఏ పోలీసులు, వైసీపీ నాయకులు పట్టించుకోరని.. తమ బాకీ తీర్చమని అడిగితే మాత్రం ఇంత రాద్ధాంతం చేస్తారా అని దస్తగిరి భార్య అన్నారు. తమపై అన్యాయంగా ఫిర్యాదు చేశారని దస్తగిరి, అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

Degree Student Rape: దారుణం.. మచిలీపట్నంలో డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం

బాధితుడి తల్లి కళావతి మాట్లాడుతూ.. ‘కుటుంబ అవసరాల కోసం తన భర్త పెద్దగూగుడువల్లీ, తాను కలిసి మూడు నెలల కిందట దస్తగిరి వద్ద వడ్డీకి 40 వేల రూపాయలు అప్పు తీసుకున్నాం. ప్రతి వారం వడ్డీ చెల్లిస్తూ వస్తున్నాం. పది రోజుల నుంచి డబ్బులు సమయానికి కట్టకపోవడంతో మా కుమారుడుని దస్తగిరి తన ఇంట్లో నిర్బంధించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే మా అంతు చూస్తానని బెదిరించాడు.’ అని అన్నారు. బాలుడి తల్లి కళావతి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్సై హుస్సేన్ తెలిపారు. ఈ క్రమంలో దస్తగిరిని పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు.

Last Updated : Jun 20, 2023, 11:26 AM IST

ABOUT THE AUTHOR

...view details