ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భారీ వర్షాలు: నివాసాల్లో గుంతలు.. భయాందోళనలో స్థానికులు

By

Published : Sep 30, 2020, 5:08 PM IST

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నివాసాల మధ్యలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఇళ్లు కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

భారీ వర్షాలు : నివాసాల్లో గుంతలు.. భయాందోళనలో స్థానికులు
భారీ వర్షాలు : నివాసాల్లో గుంతలు.. భయాందోళనలో స్థానికులు

కడప జిల్లా సింహాద్రిపురం మండలం కసునూరు గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 10 అడుగుల నుంచి 15 అడుగుల మేర పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. కొనసాగుతున్న వర్షాలతో.. ఆ గుంతల్లో నీళ్లు చేరుతున్నాయి. ఇంటి బేస్ మట్టం, గోడ కింద భారీగా నీరు చేరిన కారణంగా 15 నుంచి 20 అడుగుల లోతు మేర గుంతలు పడ్డాయి.

నాలుగైదు చోట్ల గుంతలు..

కొత్తగా కట్టిన ఇళ్లల్లో కూడా పెద్ద గుంతలు పడ్డాయని గ్రామస్థులు వెల్లడించారు. ఇలా ఊరిలో నాలుగైదు చోట్ల గుంతలు ఏర్పడ్డాయన్నారు. పైడిపాలెం రిజర్వాయర్​లో నీరు అధికంగా ఉండటం, వర్షం ఎక్కువగా కసునూరు పరిధిలోనే కురవడమే గుంతలకు కారణమని పేర్కొన్నారు.

చర్యలు తీసుకోవాలి..

వెంటనే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. భారీ గుంతలకు నివాసాలు కూలిపోయే ప్రమాదం ఉందని.. ఆందోళన చెందారు. గుంతలు ఎందుకు పడుపడుతున్నాయో అధికారులు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఇవీ చూడండి:

బురద రాజకీయాలు మాని వరద బాధితులను ఆదుకోండి: లోకేశ్

ABOUT THE AUTHOR

...view details