ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వ్యవసాయంలో కొత్త ఒరవడి... డ్రోన్​తో పురుగుమందుల పిచికారి

By

Published : Aug 9, 2021, 9:53 AM IST

వ్యవసాయంలో సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. కూలీల కొరతను అధిగమించడంతో దిగుబడి ఖర్చులు తగ్గించుకుని, అధిక దిగుబడి సాధించేందుకు తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో యంత్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా కడప జిల్లాలో పురుగుమందులను పిచికారి చేసే డ్రోన్ యంత్రం​ రైతులను ఆకర్షిస్తోంది.

drone
డ్రోన్​

కడప జిల్లా యర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామంలోని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు అంబటి క్రిష్ణారెడ్డి పొలంలో డ్రోన్​తో క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఆ డ్రోన్​ని చూసి స్థానిక రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ డ్రోన్ యంత్రం ఒక ఎకరా పొలానికి నాలుగు నిమిషాల్లో క్రిమిసంహరక ద్రావణాన్ని స్ప్రే చేస్తుందని నిర్వహకులు తెలిపారు. దీనిని వాడటం వల్ల సమయంతో పాటు పంట దిగుబడి కూడా అధికంగా వస్తుందన్నారు.

వ్యవసాయంలో కొత్త ఒరవడి... డ్రోన్​తో పురుగుమందుల పిచికారి

కడప జిల్లా ఖాజీపేట మండలం ఏటూరుకు చెందిన రైతు వెంకటసుబ్బారెడ్డి.. ఈ డ్రోన్ యంత్రాన్ని దాదాపు రూ.ఐదు లక్షల వ్యయంతో నెల్లూరులో కొనుగోలు చేశామని తెలిపారు. దీని వాడటం వల్ల సమయం ఆదా అవడమే కాకుండా మందును పైనుంచి స్ప్రే చేయడం వల్ల మొక్క మొత్తానికి పడుతుందన్నారు. ఫలితంగా కీటకాలు చనిపోయి పంట దిగుబడి బాగా వస్తుందన్నారు. ఎకరాకు రూ.నాలుగువందలు తమకు ఖర్చు వస్తుందని.. రైతుల వద్ద రూ.ఐదువందలు తీసుకుంటున్నట్టు వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. ఏ పంటలకైన ఈ యంత్రం బాగా ఉపయోగపడుతుందన్నారు.

ఇదీ చదవండి:VIVEKA MURDER CASE: నేడూ ఆయుధాల కోసం వెతకాలని సీబీఐ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details