ఆంధ్రప్రదేశ్

andhra pradesh

VIVEKA MURDER: కొనసాగుతున్న దర్యాప్తు.. విచారణకు వివేకా పీఏ కృష్ణారెడ్డి

By

Published : Aug 12, 2021, 12:20 PM IST

Updated : Aug 12, 2021, 6:42 PM IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 67వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందులలో రెండు బృందాలు ముమ్మర దర్యాప్తు చేపట్టాయి. సీబీఐ విచారణకు వివేకా పీఏ కృష్ణారెడ్డి, వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ రిజిస్ట్రార్ సురేంద్రనాథ్ రెడ్డి హాజరయ్యారు.

విచారణకు హజరైన వివేకా పీఏ కృష్ణారెడ్డి
విచారణకు హజరైన వివేకా పీఏ కృష్ణారెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 67వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో పులివెందులకు చెందిన సునీల్ బంధువు భరత్ యాదవ్, సుంకేశులకు చెందిన ఉమాశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరితో పాటు ఎర్రగంగిరెడ్డి విచారణకు హాజరయ్యారు. పులివెందులలో మరో సీబీఐ బృందం విచారణ జరుపుతోంది. సునీల్, దస్తగిరిని వివేకా ఇంటికి సీబీఐ అధికారులు తీసుకెళ్లి పరిశీలించారు. ఆ తర్వాత ఇద్దరిని పులివెందులలోని ఆర్అండ్​బీ అతిథిగృహంలో ప్రశ్నిస్తున్నారు.

వీరితో పాటు వేకా పీఏ కృష్ణారెడ్డి, ఈసీ గంగిరెడ్డి బంధువు సురేంద్రనాథ్ రెడ్డి, చెప్పుల దుకాణం యజమాని మున్నాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. సురేంద్రనాథ్ రెడ్డి వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ రిజిస్ట్రార్​గా వ్యవహరిస్తున్నారు. కడపకు చెందిన ముగ్గురు బ్యాంకు అధికారులు నిన్న విచారణకు హాజరయ్యారు. కర్ణాటకలో ల్యాండ్ సెటిల్​మెంట్​కు సంబంధించి వివేకా, సునీల్ మధ్య వివాదం ఉన్న నేపథ్యంలో అక్కడి బ్యాంక్ అధికారులు, రెవెన్యూ సిబ్బందిని సీబీఐ అధికారులు పిలవడం చర్చనీయాంశమైంది.

సునీల్ యాదవ్ కస్టడీలో ఇచ్చినటువంటి సమాచారం మేరకు అన్ని ప్రాంతాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి మధ్యాహ్నం సీబీఐ అధికారులను కలిసి వెళ్లారు. కేసు దర్యాప్తు గురించి అడిగి తెలుసుకున్నారు. పులివెందులలోని అనుమానితుల ఇళ్లలో నిన్న సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. సునీల్‌ యాదవ్, దస్తగిరి కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహించి కత్తి, కొడవలి, పలుగు, పారను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి:

కేంద్ర మంత్రి అమిత్​ షా శ్రీశైలం పర్యటన.. భారీ బందోబస్తు

Last Updated : Aug 12, 2021, 6:42 PM IST

ABOUT THE AUTHOR

...view details