ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బదిలీ వేటు.. సెలవులో కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్

By

Published : Dec 31, 2022, 6:25 PM IST

Sub Registrar on Leave: అధికార వైసీపీ నాయకులకు అక్రమ మార్గంలో భూ రిజిస్ట్రేషన్‌ చేశారని ఆవిడపై బదిలీ వేటు పడింది. అప్పటి నుంచి ఆమె సెలవులోనే ఉన్నారు. ఆవిడ స్థానంలో ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్​గా వచ్చిన వ్యక్తికి బాధ్యతలు కూడా బదలాయించలేదు. చివరికి రికార్డులు, బీరువా తాళాలు అన్నీ ఆవిడ దగ్గరే పెట్టుకున్నారు. కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవి చేసిన నిర్వాకం ఇది.

SUB REGISTRAR
సబ్ రిజిస్ట్రార్

Sub Registrar on Leave: అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు అక్రమ మార్గాల్లో రిజిస్ట్రేషన్‌ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ శ్యామలాదేవి సెలవులో వెళ్లారు. అక్రమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వైసీపీ నాయకులతోపాటు శ్యామలాదేవిపై రాయచోటి పోలీసులు.. ఈనెల 25న క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఆ రోజు నుంచే ఆమె విధులకు రావడంలేదు. శ్యామలాదేవిని కడప అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కార్యాలయానికి బదిలీ చేసినా.. అక్కడ జాయిన్‌ కాకుండా సెలవుపై వెళ్లినట్లు తెలిసింది.

మరోవైపు కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్‌గా సుందరేశానికి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించగా.. ఆయనకూ శ్యామలాదేవి బాధ్యతలు బదలాయించ లేదు. రికార్డులు, బీరువా తాళాలు అన్నీ తన వద్దనే ఉంచుకుని ఆమె వెళ్లిపోయారని తెలుస్తోంది. వారం రోజులుగా ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్.. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. పోలీసులు కూడా క్రిమినల్‌ కేసు నమోదు చేయడం తప్ప.. అంతకుమించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే జాప్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details