ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కడపలో ముఖ్యమంత్రి పర్యటన.. 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు

By

Published : Dec 22, 2022, 4:24 PM IST

Heavy security for CM Jagan Tour: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజులు పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. దీని నిమిత్తం జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసులు కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పోలీసులను బందోబస్తుకు రప్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఎస్పీ అన్బురాజన్​ పోలీసులకు సూచించారు.

Heavy security with 3000 policemen for Chief Minister visit to Kadapa
కడపలో ముఖ్యమంత్రి పర్యటన.. 3000 మంది పోలీసులతో భారీ బందోబస్తు

Heavy security for CM Jagan Tour: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీసులు కాకుండా ఇతర జిల్లాల నుంచి భారీ సంఖ్యలో పోలీసులను బందోబస్తుకు రప్పించారు. సుమారు 3000 మంది పోలీసులతో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులందరికీ ఇవాళ ఎస్పీ అన్బురాజన్ విధులను కేటాయించారు. మూడు రోజులపాటు సీఎం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా నిఘా ఉంచాలని ఎస్పీ అన్బురాజన్​ పోలీసులకు సూచించారు.

బాంబు స్క్వాడ్, పోలీస్ జాగిలాలు, మెటల్ డిటెక్టివ్ తదితర వాటితో ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు అన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కలెక్టర్, ఎస్పీ ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించి అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details