ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భారీ వర్షాలు... జలమయమైన లోతట్టు ప్రాంతాలు

By

Published : Sep 26, 2020, 3:56 PM IST

Updated : Sep 26, 2020, 9:13 PM IST

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. పంటపొలాలు నీట మునిగాయి.

heavy rain in kadapa district in last 24 hours
భారీ వర్షాలు...జలమయమైన లోతట్టు ప్రాంతాలు

కడప జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని ఎర్రగుంట్లలో అత్యధికంగా 20.7 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయింది. వరద ధాటికి వాగులు, నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి.

చక్రాయపేట మండలంలో భారీ వర్షానికి వాగులు, వంకలు, పొంగిపొర్లుతున్నాయి. దేవరగుట్ట పల్లెలోని వడ్డే వంక వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చెలకంపల్లె వంకకు వరద పొంగిపొర్లుతోంది. పాపాగ్ని నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల ప్రజలు ఎవరూ అటుగా వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలో కుండపోత కురిసింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పంటలన్నీ నీట మునగడం వల్ల భారీనష్టం జరిగిందని రైతులు వాపోతున్నారు. జమ్మలమడుగులో పలు ప్రభుత్వ కార్యాలయాలు.. కోర్టు ఆవరణ, డీఎస్పీ బంగ్లా, ఆర్టీసీ బస్టాండ్, ఎంపీడీవో కార్యాలయం నీటమునిగాయి. నియోజకవర్గంలో పంటలకు తీవ్ర నష్టం జరిగిందని... రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రైతులు విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షానికి బి కోడూరు మండలంలోని అంకనగొడుగు నూరు చెరువుకు గండి పడింది. గుర్తించిన రైతులు... వర్షాన్ని లెక్క చేయకుండా గండిని పూడ్చివేశారు.

సగిలేరు నదిలో ప్రవాహం...

ఎగువ కురిసిన భారీ వర్షాలకు సగిలేరు నదిలో ప్రవాహం కొనసాగుతోంది. వడ్డమాను, చిదానందం దిగువ సగిలేరు జలాశయానికి 14 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా... 13 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సగిలేరుకు ఇరువైపులా ఉన్న లోతట్టు గ్రామాలల్లో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఇదీ చూడండి:

గుంటూరు జిల్లాలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు

Last Updated : Sep 26, 2020, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details