ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యువతకు రహస్యంగా గంజాయి, నిద్రమాత్రలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

By

Published : Jun 8, 2021, 5:19 PM IST

కడప జిల్లాలో మత్తుకు అలవాటు పడిన యువతకు.. రహస్యంగా గంజాయి, నిద్రమాత్రలు విక్రయిస్తున్న ముఠాను.. తాలూకా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కిలో గంజాయి, 2250 నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

gang arrested for selling cannabis and sleeping pills at taluka in kadapa
యువతకు రహస్యంగా గంజాయి, నిద్రమాత్రలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి, నిద్రమాత్రలు
మత్తుకు అలవాటు పడిన యువతకు రహస్యంగా గంజాయి, నిద్రమాత్రలు విక్రయిస్తున్న ముఠాను.. కడప తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2250 నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన షేక్ ఫజిల్, సాధిక్, మౌలాలి, సాధిక్ భాష అనే నలుగురు వ్యక్తులు.. గంజాయిని, నిద్ర మాత్రలు కొనుగోలు చేసి.. మత్తుకు బానిసైన వారికి విక్రయించేవారు. విషయం తెలుసుకున్న తాలూకా పోలీసులు.. దాడులు చేసి నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కిలో గంజాయి, 2250 నిద్రమాత్రలు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సునీల్ తెలిపారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details