ఆంధ్రప్రదేశ్

andhra pradesh

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

By

Published : Aug 7, 2021, 6:40 AM IST

Updated : Aug 7, 2021, 7:14 AM IST

కడప జిల్లాలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. అనంతపురం నుంచి విజయవాడకు కూరగాయలతో వెళుతున్న లారీ.. కర్ణాటక నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. క్షతగాత్రులను కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు.

four died in road accident in kadapa district
four died in road accident in kadapa district

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి.అగ్రహారం వద్ద 67వ నెంబరు జాతీయ రహదారిపై.. అర్ధరాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. అనంతపురం నుంచి విజయవాడకు టమోటాలతో వెళ్తున్న లారీ.. బద్వేలు సమీపంలోని డి.అగ్రహారం వద్ద.. ఎదురుగా వస్తున్న కర్నాటక కారు ఢీకొన్నాయి.

పని ముగించుకుని వెళుతుండగా..

కర్ణాటక రాష్ట్రంలోని మొగల్ కోటకు చెందిన ఇమామ్ సాబ్ తమ కుటుంబ సభ్యులతో ఇన్నోవా వాహనంలో కడపకు వచ్చారు. పని ముగించుకుని నెల్లూరుకు వెళుతుండగా కూరగాయల లోడుతో బద్వేలుకు వస్తున్న ఆల్విన్ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. సద్దాం, అతని భార్య సల్మా, కార్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. రేష్మను బద్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. చిన్నారి ఆసిఫ్ తీవ్రంగా గాయపడగా.. మరో చిన్నారి ఆత్మ సురక్షితంగా బయటపడింది. వారిని చికిత్స నిమిత్తం పోలీసులు బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నలుగురి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై బ్రహ్మంగారిమఠం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆల్విన్ లారీ అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

ఇదీ చదవండి:

రైలు కిందపడి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య...

Last Updated :Aug 7, 2021, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details