ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కుటుంబసభ్యుల ఘాతుకం: యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సోదరుడు

By

Published : Jun 15, 2021, 10:07 PM IST

Updated : Jun 15, 2021, 10:48 PM IST

యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సోదరుడు
యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సోదరుడు

22:03 June 15

'మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు... మచ్చుకైనా లేడు మానవత్వం ఉన్నవాడు' అని ఓ కవి ఏ సందర్భంలో పాట రాశాడో తెలియదు కానీ... నిజంగానే రోజురోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే విషయాలకు ప్రాణాలు తీస్తున్నారు. ఫలితంగా ఎన్నో జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. తాజాగా.. కడప జిల్లా రాయచోటి కొత్తపల్లిలో కుటుంబసభ్యులే యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.

కడప జిల్లా రాయచోటి కొత్తపల్లిలో కుటుంబసభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు. యువతిపై పెట్రోల్ పోసి కుటుంబసభ్యులే నిప్పంటించారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందనే ఆగ్రహంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. ఇంట్లో తల్లిదండ్రుల సమక్షంలోనే సోదరుడు తాజుద్దీన్ నిప్పంటించి తన కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. గాయపడిన యువతిని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం యువతిని కడప రిమ్స్‌కు తరలించారు.

ఇదీ చదవండీ...Gun firing in Kadapa: గన్​తో కాల్చేశాడు.. ఆపై కాల్చుకున్నాడు.. ఇద్దరూ మృతి

Last Updated : Jun 15, 2021, 10:48 PM IST

ABOUT THE AUTHOR

...view details