ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కడప జిల్లాలో ఇళ్ల వద్దకే నిత్యావసర వస్తువులు

By

Published : Apr 8, 2020, 12:48 PM IST

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజురోజుకి పెరుగుతోంది. కడప జిల్లాలోనే 28 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. కేసులు నమోదైన ప్రాంతాలను పోలీసులు రెడ్​జోన్​గా ప్రకటించారు. అక్కడ నివసించే ప్రజల ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నారు.

Essential items delivery at home in Kadapa district
కడప జిల్లాలో ఇళ్ల వద్దకే నిత్యావసర వస్తువులు

కడప జిల్లాలో లాక్ డౌన్ అమలవుతున్న దృష్ట్యా ఇళ్ల వద్దకే నిత్యావసరరాలు సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లాలో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను పోలీసులు రెడ్ జోన్ గా ప్రకటించి రాకపోకలకు నిలిపివేశారు. రెడ్ జోన్ పరిధిలో నివసిస్తున్న వారి ఇళ్ల వద్దకే నిత్యావసర వస్తువులు అందించేందుకు ఐటీసీ సంస్థ సహకారంతో మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలీస్ కంట్రోల్ నంబర్ కు ఫోన్ చేస్తే... వస్తువులు వారి ఇళ్ల వద్దకే సరఫరా చేస్తామని ఎస్పీ అన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details