ఆంధ్రప్రదేశ్

andhra pradesh

త్వరలోనే వివేకా హత్య కేసులో నిందితుడు ఎవరో తెలుస్తుంది: డీఎల్ రవీంద్రారెడ్డి

By

Published : Jan 7, 2023, 7:18 PM IST

DL Ravindra Reddy: వైఎస్​ వివేక హత్య కేసుపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన డీఎల్​.. వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకులు సూత్రధారులు ఎవరో త్వరలోనే సీబీఐ బయట పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున ఆ కేసు తేలిన తర్వాత అన్ని విషయాలు బహిర్గతం అవుతాయని అన్నారు.

DL Ravindra Reddy
మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి

మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి

DL Ravindra Reddy on Viveka murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకులు సూత్రధారులు ఎవరో త్వరలోనే సీబీఐ బయట పెడుతుందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేటలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన డీఎల్ రవీంద్రారెడ్డి.. స్మార్ట్ మీటర్ల అంశంపై ప్రభుత్వం ప్రజల పైన భారం మోపుతోందని మండిపడ్డారు. ఇదే సందర్భంలో వివేక హత్య కేసుకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివేకాను ఎవరు చంపారో.. ఎవరు చంపించారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసని ఆరోపించారు. హంతకుల వివరాలను సీబీఐ అధికారులు బయట పెట్టకముందే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసలు హంతకుల వివరాలను వెల్లడిస్తే మంచి పేరు వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి పావుగా వాడుకున్నారని, రవీంద్రారెడ్డి ఆరోపించారు. ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున ఆ కేసు తేలిన తర్వాత అన్ని విషయాలు బహిర్గతం అవుతాయని అన్నారు. వివేక కేసులో సీబీఐ అధికారులు తాడేపల్లి ప్యాలెస్​ను కూడా విచారించాలని డీఎల్ డిమాండ్ చేశారు. ఎర్ర గంగిరెడ్డి కేసు తేలిన తర్వాత సీబీఐ తాడేపల్లి ప్యాలెస్ కూడా విచారిస్తుందని విశ్వసిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

'వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు హంతకులు, సూత్రధారులు ఎవరో త్వరలోనే సీబీఐ బయట పెడుతుంది. వివేకాను ఎవరు చంపారో, ఎవరు చంపించారో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎన్నికల్లో వివేకానంద రెడ్డిని ఓడించడానికి ఆయన ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డి, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి పావుగా వాడుకున్నారు. ఎర్ర గంగిరెడ్డి కేసు తేలిన తర్వాత సీబీఐ తాడేపల్లి ప్యాలెస్ కూడా విచారిస్తుందని అనుకుంటున్నాను.'- డిఎల్ రవీంద్రారెడ్డి, మాజీ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details