ఆంధ్రప్రదేశ్

andhra pradesh

viveka murder case: రెండో రోజు కొనసాగుతున్న ఆయుధాల గాలింపు..

By

Published : Aug 8, 2021, 9:20 AM IST

Updated : Aug 8, 2021, 9:39 AM IST

వైఎస్‌ వివేకా హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసం రెండో రోజు సీబీఐ వెతుకులాట ప్రారంభించింది. పులివెందులలోని రోటరీపురం వద్దనున్న వంకలో మారణాయుధాలు పడేశారనే సమాచారం మేరకు సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

YS Viveka murdered
వైఎస్ వివేకా హత్య

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు ఉపయోగించిన మారణాయుధాల కోసం రెండోరోజు పులివెందులలో సీబీఐ ఆరా తీస్తోంది. పులివెందుల రోటరీ పురం వద్దనున్న వంకలో మారణాయుధాలు పడేశారని సమాచారం మేరకు సీబీఐ అధికారులు వంకలో ఉన్న మురుగు నీటిని వెలికితీసే ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగిస్తున్నారు. ఉదయం ఏడు గంటలకు కీలక నిందితుడు సునీల్ యాదవ్​ను సీబీఐ అధికారులు కడప నుంచి పులివెందులకి తీసుకువచ్చారు. రోటరీపురం వద్ద నున్న వంకలో ఆయుధాలు పడేసిన ప్రాంతంలో మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది సమక్షంలో వాటిని వెలికి తీస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం లోపు బురద నీటిని ఖాళీ చేసి సాంకేతిక పరిజ్ఞానంతో ఆయుధాలు గుర్తించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న 7 గంటల పాటు బురద నీటిని వెలికి తీశారు. ఆ ప్రాంతంలో ఎవరూ రాకుండా పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు

మురుగునీటిని తోడుతున్న కార్మికులు..

నిన్న సాయంత్రం కాలువలో నుంచి మారణాయుధాల్ని వెలికితీయడానికి పులివెందుల పురపాలక సంఘంలోని పారిశుద్ధ్య కార్మికుల్ని సీబీఐ అధికారులు రప్పించారు. 8 అడుగుల వరకు లోతు ఉండటంతో కాలువలోని లక్ష లీటర్ల మురుగునీటిని యంత్రాలతో తోడారు. ఇంకా మూడు అడుగుల లోతున మురుగునీరు ఉండటంతో ఈ రోజు ఉదయానే తిరిగి పనులను ప్రారంభించారు.

ఆ దారి గుండా..

వివేకా ఇంటినుంచి కాలువ వద్దకు వెళ్లేందుకు రెండు దారులున్నాయి. ప్రధాన రహదారి మీదుగా వెళ్తే సీసీ కెమెరాలు ఉంటాయి. దాంతో నిందితులు కెమెరాలు లేని మార్గాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా సీబీఐ గుర్తించింది. ఆయుధాల్ని పడేశాక సమీపంలోని రింగురోడ్డుపైకి వెళ్లి.. అటు నుంచి పరారైనట్లు నిర్ధారణకు వచ్చింది. శనివారం వివేకా మాజీ డ్రైవరు దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డి, కడప రైల్వేస్టేషన్‌ మేనేజర్‌ మోహన్‌రెడ్డిని సీబీఐ బృందాలు విచారించాయి.

ఇదీ చదవండీ..Viveka murder case: దర్యాప్తు వేగవంతం.. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం అన్వేషణ

Last Updated :Aug 8, 2021, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details