ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పిచ్చి మాటలు మాట్లాడితే వైకాపా మెడలు వంచుతాం'

By

Published : Aug 1, 2021, 10:37 PM IST

తమ పార్టీ నాయకులపై ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శలు చేయడాన్ని భాజపా రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి ఖండించారు. టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించిన నాయకులపై ఎమ్మెల్యే రాచమల్లు వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని అన్నారు. భాజపాపైన పిచ్చి మాటలు మాట్లాడితే వైకాపా మెడలు వంచుతామని హెచ్చరించారు.

bjp state leader chirabjeevi reddy
భాజపా రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి

ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి.. భాజపాను విమర్శించే స్థాయి లేదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి రెడ్డి అన్నారు. టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించిన భాజాపా నేతలను విమర్శించడం సరికాదని మండిపడ్డారు. ఇది తన రాజకీయ మనుగడకు ముగింపు అవుతందని హెచ్చరించారు. ఇసుక దోపిడీ చేస్తూ డబ్బు సంపాదించుకుని లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని విమర్శించారు. వైకాపానే మతతత్వ పార్టీ అని.. భాజపా కాదని అన్నారు. కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి డబ్బులు పంచుతూ ఎదో అభివృద్ధి చేస్తున్నామని డప్పు కొట్టుకుంటున్నారని ఆరోపించారు.

హిందూ ధర్మ విద్వేషి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. హిందువులను, క్రిస్టియన్లను ఊచకోత కోసిన టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ప్రొద్దుటూరులో ఎందుకు పెడుతున్నారో సమాధానం చెప్పాల్సిన ఎమ్యెల్యే.. భాజపా పైన వ్యక్తిగత విమర్శలు చేయడం చాల దారుణమన్నారు. భాజపా హిందూ ధర్మం కోసం పోరాడుతుందని, ఎవరైతే హిందుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతారో వారిపై తప్పకుండా భాజపా పోరాడుతుందని స్పష్టం చేశారు. భాజపా పైన పిచ్చి మాటలు మాట్లాడితే వైకాపా మెడలు వంచుతామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details