ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఎర్ర గంగిరెడ్డి బయటుంటే దర్యాప్తునకు విఘాతం: సీబీఐ

By

Published : Mar 15, 2022, 3:45 PM IST

Viveka Murder Case: వైఎస్​ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్​ రద్దు పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్ష్యులను ప్రభావితం చేస్తాడని.. సీబీఐ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.

Viveka Murder Case
Viveka Murder Case

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. సీబీఐ దాఖలు చేసిన పిటీషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. ఎర్ర గంగిరెడ్డి, ఆయన అనుచరులు సాక్షులను తీవ్రంగా బెదిరిస్తున్నారని సీబీఐ తరఫు న్యాయవాది చెన్నకేశవులు హైకోర్టులో వాదనలు వినిపించారు.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఆదేశాల మేరకు.. దిగువ కోర్టు గంగిరెడ్డికి బెయిలిచ్చింది ఎప్పుడు..? దాన్ని రద్దు చేయాలని సీబీఐ కింది కోర్టులో పిటిషన్‌ వేసింది ఎప్పుడు...? దానిని ఆ కోర్టు కొట్టేసిందెప్పుడు..? బెదిరింపులకు పాల్పడ్డట్టు ఇచ్చిన వాంగ్మూలాల వివరాలను సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టు ముందుంచారు. గంగిరెడ్డి బయటుంటే దర్యాప్తునకు విఘాతం కలుగుతోందని, బెయిలు రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:హిజాబ్​ బ్యాన్​కు హైకోర్టు సమర్థన.. ఆ పిటిషన్లన్నీ కొట్టివేత

ABOUT THE AUTHOR

...view details