ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నిపుణుల పర్యవేక్షణలో అన్నమయ్య జలాశయం గేట్లకు మరమ్మతులు

By

Published : Nov 29, 2020, 7:28 PM IST

మూడురోజుల క్రితం మరమ్మతులకు గురైన కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం గేట్లు ఎట్టకేలకు కిందకు వచ్చాయి. వరద ఉద్ధృతి వల్ల అధికారులు గేట్లు తెరిచారు. భారీ వృక్షాలు నీటి ప్రవాహంలో కొట్టుకుని రావడంతో పాక్షికంగా గేట్లు వంగిపోయాయి. హైదరాబాద్ నిపుణుల పర్యవేక్షణలో వాటిని ఈరోజు కిందకు దించారు.

Annamayya Reservoir gates were closed  under expert supervision
'నిపుణుల పర్యవేక్షణలో కిందకు దిగిన అన్నమయ్య జలాశయం గేట్లు'

వరదల వల్ల పాడైన కడప జిల్లాలోని అన్నమయ్య జలాశయం గేట్లను..అధికారులు కిందకు దించారు. చిత్తూరు జిల్లాలో పింఛా ప్రాజెక్టు కట్ట, 18 చెరువులు తెగిపోవడంతో... అన్నమయ్య జలాశయానికి ఒక్కసారిగా 3లక్షల క్యూసెక్కుల నీరు వచ్చింది. నీటి ఉధృతికి ప్రాజెక్టులోని ఐదు గేట్ల పైనుంచి వరద నీరు ప్రవహించడంతో అన్నమయ్య ప్రాజెక్టు అధికారులు ముందస్తు చర్యగా ..9 మీటర్ల మేర గేట్లను ఎత్తారు. దీని కారణంగా ప్రాజెక్టుపై ఒత్తిడి తగ్గింది కానీ అదే సమయంలో ఎత్తిన గేట్ల ద్వారా భారీ వృక్షాలు రావడంతో టైబీన్స్ ఒంగిపోయాయి. ప్రాజెక్ట్​లో ఉండే 13 టాప్ ఫ్లాగ్ గేట్స్​లో.. 7 కొట్టుకుపోయాయి. 5వ గేటు రోప్ బోల్టు ఊడిపోయి... డోర్ కూడా వంగింది. ఇలాంటి సమస్యల కారణంగా గేట్లను అధికారులు దించలేదు.. హైదరాబాదులోని ఓ కంపెనీ నిపుణులను పిలిపించి... వారి పర్యవేక్షణలో మూడు రోజుల తర్వాత ఐదు గేట్లను కిందికి దించేశారు.

ఫలితంగా ఇటు ప్రజల్లో ఆటో రైతులు లో ఉన్న అపోహలకు చెక్ పెట్టారు. గేట్లు దెబ్బతిన్నాయని పని చేయడం లేదని పుకార్లు షికార్లు కొట్టాయి. అన్ని గేట్లు పనిచేస్తున్నాయని అన్నింటిని మూసి వేసినట్లు అన్నమయ్య ప్రాజెక్టు అధికారి రవి కిరణ్ రమేష్ తెలిపారు. అధికారులు సమయస్ఫూర్తితో వరద ముప్పు నుంచి ప్రాజెక్టును కాపాడారని వారు తెలిపారు. ప్రస్తుతం నుంచి వరద నీరు వస్తే మొదటి నాలుగు గేట్ల ద్వారా నీటిని బయటికి విడుదల చేస్తామని, ఐదో గేటుకు మరమ్మతులు చేశాక పరిశీలిస్తామని చెప్పారు. ప్రాజెక్ట్ మరమ్మతులు ఇతర అవసరాల కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేయాలని కోరారు.

ఇదీ చూడండి.అన్నమయ్య జలాశయాన్ని పరిరక్షిస్తాం: ఎంపీ మిథున్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details