ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MPTC, ZPTC Result: పరిషత్ ఎన్నికల ఫలితాలివే..

By

Published : Sep 19, 2021, 10:53 AM IST

Updated : Sep 20, 2021, 5:23 AM IST

పరిషత్ ఎన్నికల ఫలితాలివే

పశ్చిమగోదావరిజిల్లాలో ప్రాదేశిక ఎన్నికల ఓట్ల (MPTC, ZPTC Result) లెక్కింపు ప్రక్రియ పూర్తైంది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు ఓట్లను లెక్కించారు. మెజార్టీ స్థానాల్లో అధికార వైకాపా విజయ దుందుభి మోగించింది.

పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 876 ఎంపీటీసీ స్థానాలుండగా.. 73 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవయ్యాయి. మిగిలిన 781 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా .. అధికార వైకాపా 609, తెదేపా 98 జనసేన 60, భాజపా 03, ఇతరులు 11 స్థానాల్లో గెలుపొందాయి. అలాగే మొత్తం 48 జడ్పీటీసీ స్థానాలుండగా.. 2 స్ఖానాలు ఏకగ్రీవమయ్యాయి.మిగిలిన వాటిలో 43 చోట్ల వైకాపా,తెదేపా 1, జనసేన 1 చోట గెలుపొందాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో పరిషత్ ఎన్నికల ఫలితాలు

లెక్కింపు ఎలా జరిగింది..

జిల్లాలో నాలుగు ప్రధాన కేంద్రాలైన ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరం, తణుకు కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. 45కౌంటింగ్ హాళ్లు, 715 టేబుళ్లు లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు 905 మంది పర్యవేక్షకులు, 2788 మంది సహాయ సిబ్బందిని నియమించారు. నాలుగు కేంద్రాలకు ఒక్కో ఐఏఎస్ అధికారిని పర్యవేక్షణకు నియమించారు. లెక్కింపు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేస్తున్నారు.

జిల్లాలో 45 జడ్పీటీసీ స్థానాలకు, 781 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టారు. జిల్లాలో మొత్తం 48జెడ్పీటీసీల్లో ఏలూరు, జంగారెడ్డిగూడెం ఏకగ్రీవమయ్యాయి. అనివార్యకారణాలతో పెనుగొండ స్థానానికి ఎన్నికలు నిర్వహించలేదు. జిల్లాలో 876 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. 76 ఏకగ్రీవకాగా.. 13 స్థానాలు మున్సిపాలిటీల్లో విలీనమయ్యాయి. 9 స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి.

ఇదీ చదవండి : COUNTING VOTES: డివిజన్ల వారీగా ఓట్ల లెక్కింపు.. కేంద్రాల ఏర్పాటు

Last Updated :Sep 20, 2021, 5:23 AM IST

ABOUT THE AUTHOR

...view details