ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాడేపల్లిగూడెం నిట్‌లో ర్యాగింగ్ కలకలం.. విచారిస్తున్న పోలీసులు

By

Published : Mar 24, 2022, 10:10 PM IST

Updated : Mar 25, 2022, 5:10 AM IST

Ragging in tadepalligudem nit
తాడేపల్లిగూడెం నిట్‌లో ర్యాగింగ్ కలకలం

21:41 March 24

నిట్‌లో ర్యాగింగ్​పై సీనియర్లను విచారిస్తున్న పోలీసులు

Ragging at NIT: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. విశాఖకు చెందిన సెకండియర్‌ విద్యార్థి జయకిరణ్‌పై సీనియర్‌ విద్యార్థులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. బుధవారం రాత్రి రూమ్‌కు పిలుపించుకుని తెల్లవారే వరకు విచక్షణారహితంగా సీనియర్లు కొట్టారని... తల్లిదండ్రులతో కలిసి కిరణ్‌ తాడేపల్లిగూడెం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

గతంలో తనను సీనియర్‌లు కామెంట్‌ చేయగా... వెబ్‌సైట్‌ నుంచి వాళ్లకు మెసేజ్‌ చేశానని, అందుకు ప్రతీగానే దాడి చేసినట్లు కిరణ్‌ వివరించాడు. శామ్యుల్‌తోపాటు మరికొంతమంది విద్యార్థులు దాడిలో పాల్గొన్నట్లు తెలిపాడు. కిరణ్‌ ఫిర్యాదు మేరకు సీనియర్‌ విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:చదువుల తల్లిని చంపేశారా.. వైకాపా నేత కూతురి కోసం దారుణం!?

Last Updated :Mar 25, 2022, 5:10 AM IST

ABOUT THE AUTHOR

...view details