ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వృద్ధాప్య పింఛన్లు పెంచుతామని మాటిచ్చారు.. అమలు చేయండి'

By

Published : Jun 10, 2021, 11:43 AM IST

Updated : Jun 10, 2021, 11:52 AM IST

వృద్ధ్యాప్య పింఛన్లు పెంచాలని విజ్ఞప్తి చేస్తూ.. సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ లేఖ రాశారు. వృద్ధాప్య పింఛను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

raghurama letter to cm jagan
raghurama letter to cm jagan

వృద్ధాప్య పింఛన్లపై ముఖ్యమంత్రి జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ఈ నెల నుంచి రూ.2750కు పెంచి ఇవ్వాలని లేఖలో కోరారు. ఏడాదిగా పెండింగ్‌ ఉన్న పింఛన్‌ కూడా కలిపి రూ.3 వేలు ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు.

వృద్ధాప్య పింఛను రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారం సందర్భంగా హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి జగన్ కు రఘురామకృష్ణరాజు గుర్తు చేశారు. ఈ హామీతో ప్రజల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభించిందని ఆయన అన్నారు.

Last Updated : Jun 10, 2021, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details