ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rachabanda 'ఆకస్మిక తనిఖీలతో ప్రభుత్వాన్ని దారిలోకి తెస్తాం..!' చంద్రబాబు రచ్చబండలో వైసీపీ శ్రేణుల అలజడి..

By

Published : May 11, 2023, 10:57 PM IST

Nara Chandrababu Naidu: పంట నష్టపోయిన రైతలను ఆదుకోవడం లేదని చంద్రబాబు ఆరోపించారు. రైతు సమస్యలపై స్పందించకపోతే రైతులతో కలిసి తాడేపల్లి కొంపకే వచ్చి లెక్క తేల్చుకుంటామని చంద్రబాబు సీఎం జగన్​కు హెచ్చరికలు జారీ చేశాడు. ఎన్నికల ఏడాది కాకపోయి ఉంటే.. జగన్ ప్రజల ముఖం కూడా చూసేవాడు కాదని చంద్రబాబు విమర్శించారు.

Etv Bharat
Etv Bharat

Rachabanda Program With Farmers: అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవట్లేదు కాబట్టి అన్నదాతల్ని తీసుకుని నేరుగా తాడేపల్లి కొంపకే వచ్చి లెక్క తేల్చుకుంటామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఇరగవరం లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైతులతో కలిసి సమస్యలు తెలుసుకున్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం, ప్రభుత్వ చర్యలు, ఇంకా ఎదుర్కొంటున్న సమస్యలను రైతులు చంద్రబాబు కు వివరించారు. బాధల్లో ఉన్న రైతులకు అండగా ఉండేందుకే తనోచ్చానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పిరికివాడు కాబట్టే రైతుల వద్దకు రావట్లేదని చంద్రబాబు ఎద్దేవా చేసారు.

మంత్రి నోరు మూయించేందుకే రైతు పోరుబాట:ఎన్నికల ఏడాది కాకపోయి ఉంటే ప్రజల ముఖం కూడా చూసేవాడు కాదని విమర్శించారు. స్థానిక మంత్రికి రైతులంటే గౌరవం లేదని మండిపడ్డారు. స్థానిక మంత్రి ఎర్రిపప్పా.., బుజ్జినానా అని ప్రశ్నించారు. రైతుల్ని నోరుమూయమన్న మంత్రి నోరు మూయించేందుకే రైతు పోరుబాట చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వ విధానాల కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు.ఎర్రిపప్ప-బుజ్జినాన మంత్రి ధాన్యం కొనుగోళ్ల పై ఎందుకు సమాధానం చెప్పడని నిలదీశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి నేతృత్వంలో ధాన్యం సిండికేట్ మాఫియా నడుస్తోందని దుయ్యబట్టారు.40కేజీల బస్తాకు 42కేజీలు తీసుకుంటూ, అదనపు 2కేజీలు బొక్కేస్తున్నారని ఆరోపించారు.

రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు: రైతు భరోసా కేంద్రాలతో రైతులకు మేలు జరగలేదని చంద్రబాబు ఆరోపించారు. అవి రైతు భరోసా కేంద్రాలు కాదు.. దోపిడీ కేంద్రాలంటూ విమర్శించారు నేను, పవన్‌ తిరిగితేనే అధికారులు స్పందిస్తున్నారని చంద్రబాబు వెల్లడించారు. రేపటి నుంచి ఆకస్మిక తనిఖీలు చేసి ప్రభుత్వాన్నిదారిలోకి తెస్తామని చంద్రబాబు పేర్కొన్నాడు. నాకు అధికారం ఉండి ఉంటే రైతుల కష్టాలు తీర్చి వెళ్లేవాడిని చంద్రబాబు వెల్లడించారు. సీఎం అనే వ్యక్తి కష్ట సమయంలో ఆపన్నహస్తం ఇవ్వాలని కానీ, జగన్ రైతల కష్టాలపై స్పందించడం లేదని చంద్రబాబు విమర్శించాడు. వెంటనే ధాన్యం కొనాలని 72 గంటల అల్టిమేటం ఇచ్చామన్న చంద్రబాబు.. అల్టిమేటం నా కోసం కాదు రైతుల కన్నీరు తుడిచేందుకు ఇచ్చాని తెలిపాడు. రైతుల నుంచి వాస్తవాలను తెలుసుకోవడానికే రచ్చబండ కార్యక్రమం చేపట్టిన్నట్లు చంద్రబాబు తెలిపాడు.

రచ్చబండలో వైసీపీ శ్రేణులు: ఇరగవరం రచ్చబండ లో వైసీపీ శ్రేణులు చంద్రబాబు ప్రసంగానికి అడ్డుతగిలేందుకు యత్నించారు. రైతుల ముసుగులో చొరబడ్డారంటూ వారిపై ఇతర రైతులు దాడికి యత్నించారు. ఎర్రిపప్ప-బుజ్జినాన మంత్రి ఇచ్చే సూచనల మేరకు వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నారని రైతుల మండిపడ్డారు. వైసీపీ శ్రేణులపై దాడి వద్దని వారించిన చంద్రబాబు రైతులకు సర్దిచెప్పారు.

తణుకు నియోజకవర్గం ఇరగవరంలో చంద్రబాబు పర్యటన

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details