ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Crop damage in west godavari Over heavy rains: నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటాం: మంత్రి కన్నబాబు

By

Published : Nov 27, 2021, 4:36 PM IST

వర్షాలు, వరదలతో పంట (Crop damage Over heavy rains in west godavari) నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన.. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

Crop damage in west godavari Over heavy rains
మంత్రి కన్నబాబు

భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు (Minister kannababu on crop damage in ap) అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా దువ్వ, వరిఘేడు, రేలంగి, బి.కొండెపాడు గ్రామాల్లో వరదలకు నష్టపోయిన పంటలను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరావు, కొట్టు సత్యనారాయణ కలిసి పరిశీలించారు.

పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పంట దిగుబడులు, కౌలు రైతుల పరిస్థితిపై ఆరా తీశారు. కౌలు రైతులకు భూమి యజమానులు ఎంతవరకు సహకరిస్తున్నారని అడిగారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా వివరాలు నమోదు చేయాలని రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంట నష్టపోయిన కౌలు రైతులకు పరిహారం వారికే అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. కౌలు రైతుల విషయంలో భూమి యజమానులు కూడా సహకరించాలని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జిల్లాలో ప్రస్తుతం పంట కాలంలో 334 రైస్ మిల్లులకు ధాన్యం కొనుగోళ్లకు అనుమతించామని చెప్పారు. పంట నష్టం నమోదు, ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలు సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేశారు.

ఇదీ చదవండి

VUNDAVALLI ARUN KUMAR COMMENTS ON JAGAN: 'సీఎంగా జగన్ ఇంత ఘోరంగా విఫలమవుతాడని ఊహించలేదు'

ABOUT THE AUTHOR

...view details