ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రభుత్వ వైద్యురాలి నిర్వాకం.. బాలింతరాలు మృతి

By

Published : Jul 11, 2020, 10:32 AM IST

ఓ ప్రభుత్వ వైద్యురాలి నిర్వాకం కారణంగా బాలింతరాలు మృతి చెందిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

west godavari district
ప్రభుత్వ వైద్యురాలి నిర్వాకం.. బాలింతరాల మృతి

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గ్రామానికి చెందిన ఓ మహిళకు నెలలు నిండాయని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అధిక ఫీజు కట్టలేక ఓ ప్రభుత్వ వైద్యురాలిని సంప్రదించారు. ఆమె తక్కువ ఖర్చులో వైద్యం చేస్తానని చెప్పటంతో బాధితులు వైద్యం చేయించుకున్నారు.

ప్రభుత్వ వైద్యురాలు తన నివాసం వద్దనే శస్త్ర చికిత్స నిర్వహించి శిశువును బయటకు తీశారు. శస్త్ర చికిత్స చేసిన సమయంలో కొన్ని అవకతవకలు జరగటంతో బాలింతరాలి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషయం గ్రహించిన వైద్యురాలు బాలింతరాలిని హుటాహుటిన కాకినాడ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోవటంతో బాలింతరాలు మృతి చెందింది.

అప్పుడే పుట్టిన శిశువుకు తల్లి లేకుండా పోయింది. ఈ తరుణంలో బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ వైద్యరాలిని తమకు న్యాయం చేయాలని నిలదీశారు. ఈ విషయం బయటకు పొక్కకుండా మధ్యవర్తుల సహాయంతో బాధిత కుటుంబ సభ్యులకు రూ. రెండు లక్షల 15 వేల నగదు అందజేసి రాజీ చేసుకున్నారు. గతంలోనూ ఈ వైద్యురాలు పెంటపాడు మండలం ముదునూరుపాడులో ఓ మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించగా అది వికటించిన సంఘటన వెలుగు చూసింది.

ఇదీ చదవండిజంగారెడ్డిగూడెంలో కానిస్టేబుల్​కు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details