ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గోవా మద్యం పట్టివేత.. ఇద్దరు అరెస్టు

By

Published : Jul 25, 2020, 11:41 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు వాహన తనిఖీలలో గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

west godavari district
గోవా మద్యం పట్టివేత

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్​ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. పెద్ద మొత్తంలో గోవా మద్యం సీసాలు పట్టుకున్నారు. తాడేపల్లిగూడెం రూరల్ ప్రాంతం మారంపల్లి నుండి జగన్నాధపురం వెళ్లే రహదారిలో ఇద్దరు అనుమానితుల నుంచి 239 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఎస్ఐ మస్తానయ్య తెలిపారు. ఇరగవరం మండలం కావలిపురం శ్మశానవాటికలో మద్యం లావాదేవీలు నిర్వహించినట్లు సమాచారం ఉందని ఎస్ఐ పేర్కొన్నారు. నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపుతున్నట్లు మస్తానయ్య తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details