ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పోలవరం మండలానికి మరో మారు వరద ముప్పు

By

Published : Sep 1, 2020, 3:31 PM IST

పోలవరం మండలానికి మరోసారి వరద ముప్పు రావడం వల్ల ముంపు ప్రాంతాలన్నీ జల దిగ్బంధంలో ఉన్నాయి. గిరిజన ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితి వల్ల మండలంలోని ప్రజలకు వరద భయం పట్టుకుంది.

floods hit another time for godavari river in west godavari district
మండలంలో పెరగుతున్న వరద తీవ్రత

గోదావరికి మరోమారు వరద ముంచుకురావడం వల్ల పోలవరం మండలంలోని ముంపు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గత వారం గోదావరి నదికి వరద తాకిడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.

మరోసారి అదే పరిస్థితితో ఇప్పటికే 19 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద తీవ్రత పెరిగే సూచనతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పోలవరం గ్రామ సమీపంలో బలహీనంగా ఉన్న నెక్లెస్​ బాండ్​ను అధికారులు పటిష్ఠ పరుస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details