ఆంధ్రప్రదేశ్

andhra pradesh

kodi Pandelu: సందడిగా కోడి పందేలు.. కో అంటే కోట్లు!

By

Published : Jan 15, 2022, 5:31 PM IST

సందడిగా కోడి పందేలు

kodi Pandelu: సంక్రాంతి సంబరాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేలు, గుండాట, పేకాట జోరుగా సాగుతున్నాయి. ఈ ఆటల కారణంగా.. సంక్రాంతి ఒక్కరోజే సుమారు యాభై కోట్ల రూపాయలకు పైగా చేతులు మారి ఉంటాయని అంచనా..!

kodi Pandelu: సంక్రాంతి సంబరాల్లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో కోడి పందేలు, గుండాట, పేకాట జోరుగా సాగుతున్నాయి. పల్లె నుంచి పట్నం వరకు వేలాది బరులు ఏర్పాటు చేసి ఉత్సాహంగా కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, జంగారెడ్డిగూడెం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో కోడి పందేలు ఏర్పాటు చేశారు.

సందడిగా కోడి పందేలు

ఒక్కో పందెం రూ.50 వేల నుంచి గరిష్టంగా పది లక్షల రూపాయలు వరకు జరిగినట్లు తెలుస్తోంది. సంక్రాంతి ఒక్కరోజే సుమారు యాభై కోట్ల రూపాయలకు పైగా పందేల రూపంలో చేతులు మారినట్టు స్థానికులు అంచనా వేస్తున్నారు. ఈ కోడిపందేలు తిలకించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ స్థాయిలో సందర్శకులు తరలివచ్చారు.

కాగా.. తణుకు మండలం పైడిపర్రులో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గుండాట ఆడుతున్న 29 మందిని అరెస్టు చేశారు. 50 ద్విచక్రవాహనాలు, రూ.3.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెం మండలం కొమ్ముగూడెంలో ఘర్షణ చోటుచేసుకుంది. కోడి పందేలు ఆడుతుండగా ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తి కర్రలతో దాడి చేసుకున్నారు. ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇదీ చదవండి

NBK: దగ్గుబాటి ఇంట.. గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య

ABOUT THE AUTHOR

...view details