ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోతి భుజంలో తూటా.. తొలగించిన వైద్యులు

By

Published : Jul 21, 2022, 1:00 PM IST

Bullet in monkey shoulder: కుక్కల దాడిలో గాయపడిన ఓ కోతి కి వైద్యం చేస్తున్న సమయంలో.. వానరం భుజంలో తూటా కనిపించటంతో వైద్యులు అవాక్కయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడలో ఒక కోతి పై కుక్కలు దాడి చేయగా.. పశువైద్యశాలకి తరలించారు. చికిత్స చేస్తున్న సమయంలో డాక్టర్లు కోతి భుజంలో తూటాను గుర్తించారు.

bullet in monkey shoulder ay west godavari
కోతి భుజంలో తూటా.. తొలగించిన వైద్యులు

కోతి భుజంలో తూటా.. తొలగించిన వైద్యులు
Bullet in monkey shoulder: కుక్కల దాడిలో గాయపడిన ఓ కోతి కి వైద్యం చేస్తున్న సమయంలో.. వానరం భుజంలో తూటాని వైద్యులు గర్తించారు. పశ్చిమగోదావరి జిల్లా చెరుకువాడలో ఒక కోతి పై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన వానరాన్ని కొందరు భీమవరంలోని ప్రవేటు పశువైద్యశాలకి తరలించారు. చికిత్స చేస్తున్న సమయంలో డాక్టర్ సాయితేజ.. కోతి భుజంలో తూటా గాయాన్ని గమనించారు. వెంటనే వానర శరీరం నుంచి తూటను తొలగించి చికిత్స అందించారు.

సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో పోలీసులు తూటను పరిశీలించారు. ఇది బుల్లెట్ కాదని ఆక్వా చెరువుల వద్ద పక్షుల్ని కొట్టడానికి ఉపయోగించే ఫిల్లెట్ అని నిర్థరించారు.

ABOUT THE AUTHOR

...view details