ఆంధ్రప్రదేశ్

andhra pradesh

POCSO Act : స్కూల్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ కన్ను.. ఆ తర్వాత ఏమైందంటే..!

By

Published : Apr 26, 2023, 4:28 PM IST

POCSO Act : పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ పాఠశాల విద్యార్థినిని లోబర్చుకుని కామ వాంఛ తీర్చుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇక.. ఒంటరి మహిళను హతమార్చిన వ్యక్తిని విజయవాడ ఆర్టీసీ బస్టాండ్​లో పోలీసులు పట్టుకున్నారు.

Etv Bharat
Etv Bharat

An atrocity took place in Tanuku of West Godavari district : పశ్చిమగోదావరి జిల్లా తణుకులో దారుణం చోటు చేసుకుంది. పట్టణంలోని యర్రా వారి వీధిలో నివాసం ఉంటున్న ఓ ప్రబుద్ధుడు ఉన్నత పాఠశాల విద్యార్థినిని మాయ మాటలతో లోబర్చుకున్నాడు. లైంగిక వాంఛ తీర్చుకుని గర్భవతిని చేశాడు. బాలిక తల్లి షాపింగ్ మాల్​లో పని చేస్తుండగా.. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇంటికి వస్తారు. తల్లి షాపింగ్ మాల్​లో పనిచేసి రాత్రి 9 గంటల సమయంలో ఇంటికి వస్తుంది. ఇదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్ మునగాల దుర్గాప్రసాద్ బాలికపై కన్నేశాడు. బాలిక సోదరుడికి తిను బండారాల నిమిత్తం డబ్బులు ఇచ్చి బయటకు పంపించి ఒంటరిగా ఉన్న బాలికను మాయమాటలతో లోబరుచుకున్నాడు. బాలిక గర్భం దాల్చడంతో అనుమానించిన తల్లి.. ఆసుపత్రిలో వైద్యురాలికి చూపించడంతో గర్భవతిగా నిర్ధారించారు. బాలిక తల్లి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నరసాపురం డీఎస్పీ రవి మనోహరాచారి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

బాలికను మోసం చేసినట్లు ఆమె తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు విచారణ చేపట్టాం. బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో నిందితుడు వెళ్లేవాడు. బాలిక సోదరుడికి డబ్బులు ఇచ్చి ఏమైనా తెచ్చుకొమ్మని బయటకు పంపి బాలికను లోబరుచుకున్నాడు. కేసు నమోదు చేసి వివరాలు సేకరించి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశాం. మరింత లోతుగా దర్యాప్తు చేసిన పూర్తి ఆధారాలు సేకరించనున్నాం. - రవి మనోహర చారి, డీఎస్పీ, నర్సాపురం

ఒంటరి మహిళ హత్య...వీరులపాడులో సోవమ్మ అనే ఒంటరి మహిళ ఈ నెల 15 న తన నివాసంలో దారుణ హత్యకు గురైంది. ఆమెకు వివాహం కాగా భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. . కేసులో అనుమానితులను విచారించిన పోలీసులు హత్య చేసిన నిందితుడు.. మృతురాలి ఇంటి పక్కనే ఉండే పొట్టిపోగు ఏసోబుగా గుర్తించారు. నిందితుడు ఘటన జరిగిన రోజు నుంచి కనిపించకుండా పోవడంతో అతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు.. విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద తిరుగుతుండగా ఈ నెల 25న అదుపులోకి తీసుకున్నారు.

మృతురాలి కారణంగా తన కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, ఆమెను చంపాలని నిర్ణయించుకొని రోకలి బండతో తలపై గట్టిగా కొట్టానని పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు. నిందితుడు హత్యకు ఉపయోగించిన రోకలిని ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య వివరాలను నందిగామ గ్రామీణ సీఐ నాగేంద్ర కుమార్, ఎస్ఐ సోమేశ్వరరావు మీడియాకు వివరించారు.

యువతి ఆత్మహత్య: ఏడాది కాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడి పలు పర్యాయాలు అత్యాచారం చేసి పెళ్లికి నిరాకరించడంతో యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం చోటు చేసుకుంది. ఐతంపూడికి చెందిన దివ్య ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న కొమ్మర సతీష్​ ప్రేమ వ్యవహారం నడిపాడు. వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడడంతో ఆమె గర్భం దాల్చింది. దివ్య కుటుంబ సభ్యులు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వివాహం చేసుకోవాలని.. సతీష్ కుటుంబ సభ్యులను కోరారు. సతీష్ అతని కుటుంబ సభ్యులు కూడా పెళ్లికి నిరాకరించడంతో మనస్థాపం చెందిన దివ్య ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు సోదరుడు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఆంజనేయులు తెలిపారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details