ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ACCIDENT: ఆగి ఉన్న బైకును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

By

Published : Oct 12, 2021, 4:51 AM IST

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు(young man died in accident at tanuku) మృతిచెందాడు. పరిధిలోని ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ఆగి ఉన్న బైకును ఓ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జిరిగింది.

road accident in Tanuku
తణుకు సమీపంలో రోడ్డు ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలోని ఉండ్రాజవరం జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం(accident at tanuku)లో ఓ యువకుడు మృతిచెందగా మరొవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పెరవలి మండలం కాకరపర్రు గ్రామానికి చెందిన అల్లాడి సురేశ్​, నామన మణికంఠ అనే ఇద్దరూ... పట్టణంలో పువ్వుల వ్యాపారం చేస్తారు. రోజు మాదికిగానే వ్యాపారం అయిపోయిన అనంతరం ఇద్దరూ ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ట్రాఫిక్ జాం కావడంతో కంటైనర్ వెనుకాలనే బైకును ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. వాళ్ల బైకును ఢీకొట్టింది. ఈ క్రమంలో రెండు లారీల మధ్యలో ఉన్న సురేశ్​.. అక్కడికక్కడే మృతి(young man died in accident at tanuku) చెందగా.. తీవ్ర గాయపడ్డ మణికంఠను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు... ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details