ఆంధ్రప్రదేశ్

andhra pradesh

education loan: విద్యా రుణానికి విజయనగరం డీసీసీబీ ప్రణాళిక.. 10లక్షలు వరకు రుణం సాయం

By

Published : Sep 10, 2021, 3:50 PM IST

Vijayanagaram DCCB plan for education loan

సహకార బ్యాంకులంటే రైతుల పంట రుణాలే గుర్తుకొస్తాయి. కానీ ఇటీవల పెరిగిన అవసరాలు, మారిన పరిణామాల దృష్ట్యా... పంట రుణాలతో పాటు రైతులకు యంత్రాల కొనుగోలు, డెయిరీ, కోళ్ల పెంపకానికి సంబంధించిన పలు రకాల రుణాలనూ సహకార బ్యాంకులు అందిస్తున్నాయి. విజయనగరం లోని కేంద్ర సహకార బ్యాంకు మరో అడుగు ముందుకేసి...రైతుల పిల్లల చదువులకు... సహకార విద్యా రుణం పేరుతో రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఈ విధానం అమలు చేసేందుకు సమాయత్తమైంది.

విద్యా రుణానికి విజయనగరం డీసీసీబీ ప్రణాళిక

విజయనగరం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) 105సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ బ్యాంకు పరిధిలో 16శాఖలు... 95 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలున్నాయి. వీటిలో 4 లక్షల 32 వేల మంది రైతులకు సభ్యత్వం ఉంది. ఇందులో 70 వేల మంది రుణాలు పొందుతున్నారు. డీసీసీబీ ఛైర్మన్​(DCCB CHAIRMAN)గా... నూతనంగా బాధ్యతలు చేపట్టిన నెక్కెల నాయుడు బాబు(NEKKALA NAIDU BABU)... బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఖాతాదారులకు పంట రుణాలే కాకుండా.... వ్యవసాయేతర రుణపరపతిని పెంచేందుకు కార్యాచరణ రూపొందించారు. దీనితోపాటు సహకార విద్యా రుణాల విధానానికి రూపకల్పన చేశారు.

ఈ విధానం తొలిసారి..

సహకార విద్యా రుణాల (EDUCATION LOANS) విధానం ద్వారా సహకార బ్యాంకుల్లో సభ్యత్వం ఉన్న రైతుల పిల్లలకు.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి విద్యా రుణాలను అందించనున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది రైతుల పిల్లలు ఉన్నత విద్య, విదేశాల్లో చదువుకునే అవకాశాలను కోల్పోకుండా... తమ బ్యాంకు పరిధిలోని రైతుల పిల్లల చదువులకు చేయూతనివ్వాలనే లక్ష్యంతో తొలిసారి సహకార విద్యా రుణ విధానాన్ని ప్రవేశపెట్టామని డీసీసీబీ ఛైర్మన్ తెలిపారు.డీసీసీబీ నూతనంగా అమలు చేస్తున్న సహకార విద్యా రుణాలపై పాలకవర్గం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ద్వారా రైతు కుటుంబాల్లోని పిల్లలకు ఎంతోగానో ప్రయోజనం చేకూరుతుందన్నారు.


రూ. లక్ష నుంచి 10లక్షల వరకు రుణ సాయం

డీసీసీబీ నుంచి సహకార విద్యారుణం పొందాలంటే... రైతులు సభ్యత్వంతో పాటు.. కొంత భూమి కలిగి ఉండాలి. విద్యార్థుల చదువుకు అవసరమయ్యే ట్యూషన్ ఫీజు, వసతి సౌకర్యానికయ్యే ఖర్చు వివరాలు కళాశాలల నుంచి రాత పూర్వకంగా తీసుకుని... బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుందని బ్యాంకు సీఈవో (CEO) తెలిపారు. లక్ష రూపాయల నుంచి 10లక్షల రూపాయల వరకు...అర్హతను బట్టి రుణం పొందవచ్చన్నారు.డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్యం తదితర ఉన్నత విద్యా కోర్సులకు ఈ రుణం తీసుకోవచ్చు. చదువు పూర్తైన తరువాత ఆరునెలల నుంచి అప్పును చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అయిదేళ్లలో మొత్తం అప్పున చెల్లించాలని సీఈవో అన్నారు. మహిళా సంఘాలకు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకానికి ఆర్థిక చేయూత (Financial help) అందించాలని డీసీసీబీ నిర్ణయించింది. వీటితోపాటు ... బంగారంపై తక్కువ వడ్డీకే రుణ పరపతి అవకాశం కల్పించనుంది.

ఇదీ చదవండి..

TAGGED:

ABOUT THE AUTHOR

...view details