ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం దొంగతనం డ్రామా..

By

Published : Oct 26, 2020, 7:09 PM IST

ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం దొంగతనం డ్రామా ఆడిన నిందితులను విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. డెంకాడ మండలం మోదవలస జీడి పిక్కల ప్రాసస్సెంగ్ కంపెనీ నుంచి 24 లక్షల రూపాయల విలువ చేసే జీడి పిక్కలను లారీలో లోడ్ చేసి దొంగిలించినట్లు మేనేజర్ వాసుదేవ్ గిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు విషయం తెలిసింది.

Theft drama
Theft drama

విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచే వాసుదేవ్ కోటి 50 లక్షలు ఫైనాన్స్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు అతడు ఫైనాన్స్ కంపెనీకి కోటి రూపాయల వరకు చెల్లించాడు. మిగిలిన సొమ్ము తీర్చలేకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ యజమాని మనోజ్ కుమార్​ను సంప్రదించారు. అయితే... మనోజ్ అతడ్ని తప్పుదోవ పట్టించాడు. జీడి పిక్కల కంపెనీలో ఉన్న 24 లక్షల రూపాయల సరకును ఎవరో దొంగిలించినట్లుగా కేసు పెట్టి, ఇన్సూరెన్స్ క్లయిమ్ చెయ్యవచ్చన్న సలహా ఇచ్చాడు.

దీంతో తన కంపెనీలో ఉన్న సరకును ఓ లారీలో లోడ్ చేయించి నర్సీపట్నం గోడౌన్​కి తరలించారు. ఆపై తమ సరకు చోరీకి గురైందని డెంకాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో అసలు గుట్టురట్టవడంతో లారీలో లోడింగ్ చేసిన ఇద్దరి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు సూత్రధారులు పరారీలో ఉన్నారు.

ఇదీ చదవండి:వైరల్​ కంటెంట్ నియంత్రణకు ఫేస్​బుక్ కీలక నిర్ణయం!

ABOUT THE AUTHOR

...view details