ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కొంతమంది సెలబ్రిటీలు భాజపా ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారు'

By

Published : Feb 5, 2021, 7:41 PM IST

దిల్లీలో రైతుల ఉద్యమంపై కొంతమంది సెలబ్రిటీలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భాజపా ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారని ఎపీసీసీ ఛీప్ శైలజానాథ్ ఆరోపించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతుల పట్ల క్రికెటర్ సచిన చేసిన వ్యాఖ్యలను ఈయన ఖండించారు.

sailajanath fire on sachin tendulkar
కొంతమంది సెలబ్రిటీలు భాజపా ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారు

దిల్లీలో నిరసన చేస్తున్న రైతుల పట్ల క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలను ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్ ఖండించారు. రైతులను ఉద్దేశించి సచిన్ ఆ విధంగా మాట్లాడటం బాధాకరంగా ఉందన్నారు. విజయనగరంలో ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సచిన్ ఏ రోజూ భారత్ తరఫున క్రికెట్ ఆడలేదని, కేవలం బోర్డు తరఫున మాత్రమే ఆడారని విమర్శించారు. కొంతమంది సెలబ్రిటీలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భాజపా ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

శిరోముండనం కేసు బాధితుడు వరప్రసాద్ కనిపించడం లేదని.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి:'విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం షాక్​కు గురి చేసింది'

ABOUT THE AUTHOR

...view details