ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మహారాజ కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి'

By

Published : Oct 18, 2020, 3:04 PM IST

మహారాజ కళాశాల పట్ల జరుగుతున్న పరిణామాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని... పాలకులు ఈ విషయాన్ని గుర్తించాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు సూచించారు. కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని పేర్కొంటూ.. మాన్సస్​ సంస్థ పూర్వ విద్యార్ధులు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు.

protest rolly for maharaja college in vizianagaram district
మహారాజ కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి

మహారాజ కళాశాలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు డిమాండ్​ చేశారు. ఈ మేరకు ప్రజాసంఘాలు, పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. దేశంలోని విద్యా సంస్థల్లో మహారాజ విద్యా సంస్థలకు ఎనలేని గుర్తింపు, గౌరవం ఉందని ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు అన్నారు.

అటువంటి గొప్ప కళాశాలను ప్రైవేటీకరణ చేసే నిర్ణయం సరైంది కాదన్నారు. 12 రోజులుగా కళాశాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details