ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నృత్యాలు, పాటలతో పోలీసు అమరవీరులకు నివాళులు

By

Published : Oct 30, 2020, 11:47 PM IST

పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా.. విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్​లో పలు కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిమిక్రీ, నాటకాలు, పాటలు, నృత్యాలతో ఆహుతులను అలరించారు.

police commemoration week in vizianagaram
విజయనగరంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు

విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండ్​లో అమరవీరుల త్యాగాలను, దేశభక్తిని ప్రతిబింబించే సాస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి.. జిల్లా ఎస్పీ రాజకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మావోయిస్టులు, ప్రత్యేక దళాల మధ్య జరిగే కాల్పుల డెమో చూపించారు. పలు డైలాగ్​లు, మిమిక్రీ, పాటలు, శాస్త్రీయ నృత్యాలు, నాటకాలను ప్రదర్శించారు. వీక్షకులను ఈ కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details