ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సచివాలయాల ద్వారా పంటల కొనుగోళ్లు : పుష్పశ్రీవాణి

By

Published : Apr 7, 2020, 10:08 PM IST

వైకాపా ప్రభుత్వం రైతు పక్షపాతి అని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి అన్నారు. లాక్​డౌన్ ప్రభావం రైతులపై పడకుండా మద్దతు ధర అందించేందుకు సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆమె తెలిపారు. మొక్కజొన్న రైతులకు మద్దతు ధర అందేలా అన్ని చర్యలు చేపడతామన్నారు.

Minister puspa srivani
ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

పార్వతీపురంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పుష్పశ్రీవాణి

విజయనగరం జిల్లా పార్వతీపురం మార్కెట్ యార్డ్ ఆవరణలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ప్రారంభించారు. లాక్​డౌన్ కారణంగా రైతులు నష్టపోకూడదనే ఆలోచనతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని తెలిపారు. మొక్కజొన్న రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ప్రజలందరూ సామాజిక దూరం పాటించి కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. మార్కెట్​ యార్డ్ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగారావు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details