ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అకాల వర్షాలు.. రైతుకు అపార నష్టం

By

Published : Apr 4, 2021, 4:53 PM IST

Updated : Apr 4, 2021, 6:18 PM IST

అకాల వర్షాలకు విజయనగరం జిల్లా రైతులు విలవిలలాడుతున్నారు. సాలూరు మండలం మామిడిపల్లిలో శనివారం ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా.. పెద్ద ఎత్తున అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

rains in vizianagaram
అకాల వర్షాలకు నేలకొరిగిన పంట

అకాల వర్షాలకు నేలకొరిగిన పంట

విజయనగరం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లిలో శనివారం వీచిన గాలులకు.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొక్కజొన్న, అరటి పంట నేలకొరిగింది. వ్యవసాయ అధికారులు పరిశీలించి పంట నష్టం అంచనా వేసే పనిలో పడ్డారు.

మండలం మొత్తం 12 వందల ఎకరాల్లో మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. ఇందులో దాదాపు 80 శాతం పంట సాగు చేసిన అనంతరం.. ఈదురు గాలులకు పడిపోయింది. 800 హెక్టార్లలో అరటి సాగు చేస్తుండగా.. మామిడిపల్లిలో దాదాపు 160 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Last Updated :Apr 4, 2021, 6:18 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details