ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఆంగ్ల మాధ్యమం అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది'

By

Published : Nov 16, 2019, 5:43 PM IST

పార్వతీపురంలో సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి సందడి చేశారు. తాను తీసిన ''మార్కెట్లో ప్రజాస్వామ్యం'' చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

స్నేహితులతో కలిసిదర్శకుడు ఆర్. నారాయణ మూర్తి

ఆంగ్ల మాధ్యమం అమలు చేస్తే పేద పిల్లలకు ఉపయుక్తంగా ఉంటుంది

విజయనగరం జిల్లా పార్వతీపురంలో సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి... అభిమానులతో కలిసి సందడి చేశారు. భాస్కర్ విద్యాసంస్థల అధినేత చుక్క భాస్కర్​రావుతోపాటు... పట్టణ ప్రముఖులను కలిశారు. అభిమానులతో కాసేపు ముచ్చటించారు. తాను తీసిన ''మార్కెట్లో ప్రజాస్వామ్యం'' చిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ చిత్రాన్ని అంతా ఆదరించి... మరిన్ని మంచి చిత్రాలు తీసేందుకు ప్రోత్సహించాలని కోరారు. తాను చదువుకున్న రోజుల్లో ఆంగ్లమాధ్యమం లేనందునే... సరైన ఉద్యోగం సాధించలేకపోయాననీ పేర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచే ఆంగ్లమాధ్యమం అమలు చేస్తే... పేద పిల్లలకు ఉపయుక్తంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Intro:Body:Conclusion:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details