ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బైక్​లో ఒక్కసారిగా మంటలు.. క్షణాల్లో బూడిదైన వాహనం

By

Published : Jun 4, 2020, 2:54 PM IST

రహదారిపై ఓ వ్యక్తి బైక్ పై వెళుతుండగా వాహనంలో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. భయంతో వాహనచోదకుడు వాహనాన్ని వదిలి పరుగులు తీశాడు. కొద్దిసేపటికే బైక్ పూర్తిగా కాలి బూడిదైంది.

bike
bike

రోడ్డుపై వెళుతున్న ద్విచక్ర వాహనం నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వాహనచోదకుడు బైకుపై నుంచి దూకి పరుగులు తీశాడు. కాసేపట్లోనే బైక్ పూర్తిగా దగ్ధమైంది.

ఈ ఘటన విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం.. ఎర్రన్నగుడి సమీపంలో జరిగింది. బైకు బ్యాటరీ నుంచి మంటలు వ్యాపించి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details