ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం..  పాల్గొన్న టీడీపీ నేతలు

By

Published : Apr 3, 2023, 9:01 PM IST

Updated : Apr 3, 2023, 9:10 PM IST

Bc Rountable Meet In visakha: జగన్ సర్కార్​లో బీసీలకు రక్షణ లేదని.. రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నేతలు వ్యాఖ్యానించారు. దీంతో పాటు బీసీ సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. బీసీలకు న్యాయం చేసింది కేవలం టీడీపీ మాత్రమేనని పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే..

BC Round Table Meeting in Visakhapatnam
విశాఖలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం

విశాఖలో బీసీ రౌండ్ టేబుల్ సమావేశం

Bc Rountable Meet In visakha: విశాఖలో బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీలకు రావాల్సిన 34 శాతం రిజర్వేషన్ అంశంపై ప్రధాన చర్చ జరిగింది. రాష్ట్రంలో ఉన్న 140 కులాల్లో 84 కులాలు ఇంకా అడుగుపెట్టలేదంటూ టీడీపీ నేతలు జగన్ సర్కారుపై మండిపడ్డారు. దీంతోపాటు జగన్ సర్కారులో బీసీలకు రక్షణ లేదని.. ఎంతో మంది బీసీలపై దాడులు, హత్యలు జరిగాయని పేర్కొన్నారు.

బీసీల ఆత్మ గౌరవం, బీసీల అభివృద్ధిపై జరిగిన ఈ సమావేశంలో.. బీసీ సబ్ ప్లాన్ నిధులను జగన్ ప్రభుత్వం దారి మళ్లించిందని టీడీపీ నేతలు ఆరోపించారు. బీసీ కార్పొరేషన్​ను నిర్వీర్యం చేశారని.. తద్వారా అనేక మంది విద్యార్థులు విదేశీ విద్యను కోల్పోతున్నారని ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. దీంతో పాటు స్థానిక సంస్థలో బీసీ రిజర్వేషన్లు తగ్గించారని.. బీసీలపై జగన్​కు ఉన్నది కపట ప్రేమని అన్నారు. జగన్ క్యాబినెట్​లో బీసీ మంత్రులు కీలు బొమ్మలుగా మారారని, రాష్ట్రంలో అధికారం అంతా నలుగురు చేతిలోనే ఉందని ఆరోపించారు. జగన్, సజ్జల, విజయ సాయరెడ్డి, పెద్దిరెడ్డి.. ఈ నలుగురే రాష్ట్రానికి పట్టిన దుష్ట చతుష్టయమని టీడీపీ నేతలు మండిపడ్డారు.

బీసీల రిజర్వేషన్​కు తూట్లు పొడుస్తూ.. బీసీలకు జగన్ తీవ్ర అన్యాయం చేస్తున్నారన్న నాయకులు.. బీసీలకు న్యాయం చేసింది కేవలం ఎన్టీఆర్, టీడీపీ మాత్రమేనని అన్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర, బండారు సత్యనారాయణ మూర్తి, పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు దువ్వారపు రామారావు, చిరంజీవి రావు, సీపీఐ, సీపీఎం వంటి పలు రాజకీయ పార్టీలకు చెందిన బీసీ నేతలు పెద్ద ఎత్తుల హాజరయ్యారు.

"బీసీలకు రాజ్యాధికారం లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. బీసీలకు ఇవ్వాల్సిన 34 శాతం రిజర్వేషన్ రావాలనే డిమాండ్ పైనే ప్రధాన చర్చ జరిగింది. మొత్తం 140 కులాలు 84 కులాలు ఇంకా అసెంబ్లీ లో అడుగు పెట్టలేదు.. ఈ సమావేశం ద్వారా 34 రిజర్వేషన్ కోసం సమావేశం తీర్మాణం చేసింది."
- పల్లా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు

"బలహీన వర్గాలను సీఎం అణచివేస్తున్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ 10 శాతం కోత విధించాడు. తద్వారా 16 వేల మంది బీసీలను అధికారానికి దూరం చేశారు. కార్పొరేషన్లలో నిధులు లేకుండా, కనీసం కుర్చీ లేకుండా.. బీసీలను వాడుకుంటున్నారు.. నిధులు-విధులను ఉన్న శాఖలను అగ్ర కులాలకు ఇచ్చారు. మరి బీసీలకు ఏం ఇచ్చారు? బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్​మెంట్ కూడా ఎందుకు తీసేశారు?."
- కొల్లు రవీంద్ర, మాజీమంత్రి

ఇవీ చదవండి:

Last Updated : Apr 3, 2023, 9:10 PM IST

ABOUT THE AUTHOR

...view details