ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మున్సిపల్​ ఎన్నికలు: తెదేపా గూటికి వైకాపా కార్యకర్తలు

By

Published : Feb 28, 2021, 5:43 PM IST

మున్సిపాలిటీ ఎన్నికలకు ముందు చేరికలు ఊపందుకున్నాయి. విశాఖ జిల్లాలో పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు.

ycp activist join in tdp
మున్సిపల్​ ఎన్నికల వేళ.. తెదేపా గూటికి వైకాపా కార్యకర్తలు

విశాఖ జిల్లా నర్సీపట్నంలో పుర పోరుకు ముందు వలసలు ఊపందుకున్నాయి. పట్టణంలోని రెండో వార్డులో 50 మంది వైకాపా కార్యకర్తలు తెలుగు యువత అధ్యక్షుడు మురళీకృష్ణ ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. పార్టీ కండువా కప్పి తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ వారిని ఆహ్వానించారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పీఠంపై తెదేపా జెండా ఎగరవేయడానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details