ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విశాఖ జిల్లా భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి కేంద్రప్రభుత్వ అవార్డు

By

Published : Oct 18, 2019, 1:12 PM IST

విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించింది. పచ్చదనం, పరిశుభ్రత, రోగులతో వైద్య సబ్బంది వ్యవహరించే తీరులో ఈ ఆసుపత్రికి జిల్లాలోనే ప్రథమ బహుమతి లభించింది. ఈ బహుమతిపై వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పచ్చదనానికి చిరునామాగా మారిన విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రి

పచ్చదనానికి చిరునామాగా మారిన విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రి

విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి అరుదైన గుర్తింపు లభించింది.కేంద్రప్రభుత్వం ప్రతిపాధించిన కాయకల్ప విభాగంలో అత్యుత్తమ సేవలకు గాను జిల్లాలో భీమిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అవార్డు వచ్చింది.ఈ అవార్డు కింద ఐదు లక్షల నగదును అందజేశారు.పచ్చదనం పరిశుభ్రత,రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించే సేవలకుగాను ప్రథమ బహుమతి వచ్చిందని..వైద్య సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.ఆసుపత్రి ప్రాంగణాన్ని పచ్చని మొక్కలతో నిండి మనసుకు ఉల్లాసాన్నిచ్చేలా తీర్చిదిద్దారు.ఆసుపత్రి ప్రహరీ గోడలపై రోగులు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు,నియమాలను రాశారు.ఆరోగ్యానికి అవసరమయ్యే మంచి విషయాలు పట్ల రోగుల్లో అవగాహన కలిగేలా ఆసుపత్రి సిబ్బంది ఉంటారని సూపరింటెండెంట్ సిద్ధార్థ తెలిపారు.

Intro:Ap_Vsp_106_17_Aasupatri_Pachadanam_Ab_AP10079
b ramu భీమునిపట్నం నియోజవర్గం విశాఖ జిల్లా


Body:విశాఖ జిల్లా భీమునిపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లాస్థాయిలో పచ్చదనం పరిశుభ్రత, రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించడం తదితర సేవలకుగాను ప్రధమ బహుమతి ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న సి హెచ్ సి ల లో లో భీమిలికి అవార్డు దక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అవార్డుతో పాటు ఐదు లక్షల నగదు కూడా ఆసుపత్రి అభివృద్ధికి మంజూరు చేయబడింది ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్ధార్థ ఆధ్వర్యంలోని వైద్య బృందం సిబ్బంది సహాయ సహకారాలతో తో వృధాగా ఎక్కడ చెత్తాచెదారం లేకుండా ఆస్పత్రి ప్రాంగణమంతా పచ్చని మొక్కలతో నిండి ఉంది. ఆస్పత్రికి వస్తున్న రోగులకు పచ్చదనంతో సాంత్వన తో పాటు సకాలంలో వైద్య సేవలు అందుతున్నాయి దీంతో త్వరితగతిన రోగులు కోలుకుంటున్నారు ఆసుపత్రి ప్రహరీ గోడలపై రోగులు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు నియమాలను సైతం రాయడంతో ఆరోగ్యానికి అవసరమయ్యే మంచి విషయాలు పట్ల అవగాహన పెంపొందించుకున్నారు. వైద్యులు కనకదుర్గ పూర్ణిమ వసుంధరాదేవి వాణి కార్తీక్ తదితరులు వైద్య సేవలతో పాటు ఆసుపత్రి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా కృషి చేస్తున్నారు
బైట్: డాక్టర్ సిద్ధార్థ సూపరిండెంటెండ్ సి హెచ్ సి ఇ భీమునిపట్నం


Conclusion:

TAGGED:

ABOUT THE AUTHOR

...view details