ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vasenapoli Food Center in visakha: ఉపరాష్ట్రపతి మెచ్చిన ఇడ్లీ, దోశె.. ఎక్కడ దొరుకుతాయో తెలుసా..?

By

Published : Nov 26, 2021, 10:20 AM IST

Variety idli

ఆస్తులు కాదు...ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది వైద్యులే కాదు.. పెద్దలు కూడా చెప్పేమాట. అందుకే జంక్‌ ఫుడ్‌ కాకుండా బలవర్ధక ఆహారం తినాలని సలహాఇస్తారు. ఈ మాటల్నే వ్యాపార సూత్రంగా మార్చుకున్నాడు ఓయువకుడు. ఇడ్లీ,దోసె వంటి సంప్రదాయ అల్పాహారాన్ని చిరుధాన్యాలతో తయారు చేస్తున్నాడు. మంచి రుచి, శుచితో ఉపరాష్ట్రపతిని మెప్పించాడు.! ఇంతకీ ఆ అల్పాహార ప్రత్యేకతలేంటో చూద్దామా”?

తృణధాన్యాలతో వెరైటీ ఇడ్లీ, దోసెలు... బాగుందంటూ ఉపరాష్ట్రపతి ట్వీట్‌

Vasenapoli Food Center in visakha: రోజులు మారే కొద్దీ ప్రకృతిసేద్యంతో పండించే ఆహార ధాన్యానికి గిరాకీ పెరుగుతోంది. ఫైవ్ స్టార్ హోటళ్ల సంగతి పక్కనబెడితే రోడ్డుపక్కనుండే ఆహార బండ్లు దగ్గరా వినియోగదారుల సందడి బాగానే కనిపిస్తోంది. ఇక్కడ మనం చూస్తున్న ఈ వాసెనపోలి అల్పాహార కేంద్రమూ అలాంటిదే.

విశాఖలో ఉన్న ఈ వాసెనపోలి ఆహారకేంద్రాన్ని... చిట్టెం సుధీర్ అనే యువకుడు ఏర్పాటు చేశాడు. గిరిజనుల ఆరోగ్యం, ఆహారశైలిని పరిశీలించడం ద్వారా..... రసాయన రహిత ఆహారాన్ని వినియోగదారులకు చేరువ చేయాలని,.... నిర్ణయించుకున్నాడు. రాగులు, జొన్నలు, ఇలా వివిధ రకాల చిరుధాన్యాలతో ఇడ్లీలు, దోసెలు అందిస్తున్నాడు. ఇక్కడ టిఫెన్లతోపాటు వాసెనపోలీ అనే పేరుకు ప్రత్యకంగా తెలుగు నేపథ్యం ఉందంటున్నారు సుధీర్‌.


ఉపరాష్ట్రపతిని మెప్పించాడు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇటీవల విశాఖ పర్యటనలో.. వాసెనపోలి నుంచి ఇడ్లీ తెప్పించుకుని రుచిచూశారు. ఆ వెంటనే ట్విటర్‌ వేదికగా ప్రశంసించారు. ఈ ట్వీట్‌తో సుధీర్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. వాసెనపోలి పేరే కాదు. ఇందులో టిఫెన్లూ విభిన్నంగా ఉన్నాయంటున్నారు వినియోగదారులు. ఉపాధి మార్గంవైపు యువత ప్రయత్నాలకు...ఆహార రంగంలో ఈ తరహా కొత్త అలోచనలు జతచేయడం....పురోగతి బాటకు వీలుకల్పిస్తుందని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:Parade of Sails: విశాఖలో ఘనంగా పరేడ్ ఆఫ్ సెయిల్స్

ABOUT THE AUTHOR

...view details