ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సింహాచలం దేవస్థానానికి 30 షామియానాలు బహూకరణ

By

Published : May 17, 2021, 6:35 PM IST

ప్రముఖ క్షేత్రమైన విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవస్థానానికి రూ.3లక్షలు విలువైన షామియానాలను ఓ భక్తుడు బహూకరించారు. ఎండ నుంచి భక్తులకు రక్షణ కల్పించేందుకు వీటిని అందించినట్లు దాత వెంకటలక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు.

tents donate to simhachalam appanna temple
సింహాచలం దేవస్థానానికి షామియానాలు బహూకరణ

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి టీ.వెంకట లక్ష్మీ నరసింహమూర్తి.. రూ.3.10 లక్షలతో 30 షామియానాలను సింహాచలం దేవస్థానానికి బహూకరించారు. ఈ మేరకు దేవస్థానం ఈఈ శ్రీనివాసరాజుకు వీటిని అందజేశారు. వేసవి నేపథ్యంలో భక్తులకు ఎండ తగలకుండా ఉండేందుకు వీటిని ఇచ్చినట్లు దాత లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా దాతను ఆలయ అర్చకులు సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details