ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TDP on Jagan: సీఎం జగన్‌లా.. ఊసరవెల్లి కూడా రంగులు మార్చలేదు: గంటా శ్రీనివాసరావు

By

Published : May 4, 2023, 5:14 PM IST

Tdp leader Ganta Srinivasulu fire o cm jagan: ముఖ్యమంత్రి జగన్‌పై తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విపక్ష నేతగా జగన్ మాట్లాడిన మాటలకు, భోగాపురం శంకుస్థాపన సమయంలో మాట్లాడిన మాటలకు ఏ మాత్రం పొంతన లేదంటూ ఓ వీడియోను విడుదల చేసిన ఆయన.. ఊసరవెల్లి కూడా జగన్‌‌లాగా రంగులు మార్చలేదని వ్యాాఖ్యానించారు.

Tdp leader
Tdp leader

Tdp leader Ganta Srinivasulu fire o cm jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. డిఫెన్స్‌కి, సివిల్స్‌కి తేడా తెలియని ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. నేడు విశాఖపట్టణం జిల్లాకు చెందిన తెలుగుదేశం నేతలతో కలిసి గంటా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

రాజకీయ లబ్ధి కోసమే మళ్లీ శంకుస్థాపన.. గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ..''సీఎం జగన్.. రాజకీయ లబ్ధి కోసమే భోగాపురం ఎయిర్‌ పోర్టు, అదానీ డెటా సెంటర్లకు మళ్లీ శంకుస్థాపన చేశారు. పెట్టుబడుల సదస్సు జరిగి రెండు నెలలు గడిచిన కూడా ఇప్పటివరకూ మళ్లీ ఎందుకు సమీక్ష చేపట్టలేదు..? ఉత్తరాంధ్ర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయగలరా..?. విపక్ష నేతగా జగన్ మాట్లాడిన మాటలకు, భోగాపురం శంకుస్థాపన సమయంలో మాట్లాడిన మాటలకు ఏమాత్రం పొంతన లేదు. ఊసరవెల్లి కూడా జగన్‌లా రంగులు మార్చలేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం.. మీరు సిద్ధమేనా..?. రాష్ట్రంలో రామోజీరావు, ఆదిరెడ్డిలే చిట్​ఫండ్స్​ కంపెనీలు నడుపుతున్నారా.. మిగతా వారు నడుపుతున్నది కన్పించడం లేదా..?'' అని ఆయన నిలదీశారు.

చంద్రబాబును అరెస్ట్ చేయడం వైసీపీ వల్ల కాదు..

చంద్రబాబును అరెస్ట్ చేయడం మీ వల్ల కాదు..ప్రశ్నిస్తే చాలు తెలుగుదేశం పార్టీ నేతల ఆస్తుల్ని ధ్వంసం చేయటం.. రుషికొండను ఇష్టారీతీనా తవ్వుతున్నారు కదా.. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. గతకొన్ని రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అవ్వడం ఖాయమంటూ ప్రచారం చేయటంపై గంటా ఘాటుగా స్పందించారు. చంద్రబాబును అరెస్ట్ చేయటం మీ వల్ల కాదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. హైదరాబాద్ డెవలప్​మెంట్​ గురించి గతంలో కేటీఆర్ మెచ్చుకున్నారని.. తాజాగా అదే విషయాన్ని రజనీకాంత్ కూడా చెప్పారన్నారు. చంద్రబాబుని మెచ్చుకోవడం తట్టుకోలేకపోయిన వైసీపీ నేతలు.. కుక్కల్లా మొరుగుతున్నారన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ విచ్చలవిడిగా తయారయ్యిందని, దేశంలో ఎక్కడా దొరికినా ఏపీ మూలాలే బయటకు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం జగన్..ఓ సైకో.. రానూరానూ సీఎం జగన్.. సైకోలా తయారయ్యారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. హెలికాప్టర్‌లో వెళ్లే సీఎం కోసం దాదాపు 100 కిలోమీటర్ల మేర రోడ్డును బ్లాక్ చేయటం దారుణమన్నారు. రూట్ లేని ఏరియాలో రెండు రోజులపాటు దుకాణాలు మూసేయడం ఏంటని ప్రశ్నించారు. మేడే రోజున 840 కేజీలతో నలుగురు యువకులు దొరకడం అన్యాయమన్న ఆయన..రాష్ట్రంలోని యువతకు ఉపాధి లేక గంజాయిని రవాణా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సంగతి ఈ ప్రభుత్వం మర్చిపోయిందని, వైసీపీ ప్రభుత్వ హయాంలో యువత నిర్వీర్యమైపోయిందన్నారు. రాష్ట్రంలో వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, ఎమ్మెల్సీ చిరంజీవిరావులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ

ABOUT THE AUTHOR

...view details