ETV Bharat / state

kidney case విశాఖ కిడ్నీ రాకెట్ కేసు.. ఇద్దరు కీలక నిందితులు అరెస్ట్.. ఎవరంటే?

author img

By

Published : May 4, 2023, 1:15 PM IST

Visakhapatnam kidney racket case latest news: విశాఖపట్టణం జిల్లాలో కలకలం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు అరెస్ట్ చేసిన ఆ నిందితుల్లో మొదటి వ్యక్తి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు కాగా, రెండవ వ్యక్తి దళారిగా వ్యవహరించిన వెంకటేశ్వరరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

kidney case
kidney case

Visakhapatnam kidney racket case latest news: విశాఖపట్టణం జిల్లాలో గత నెలలో వెలుగుచూసిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కిడ్నీ రాకెట్ కేసులో కీలకంగా వ్యవహరించిన మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు అరెస్ట్ చేసిన ఆ నిందితుల్లో మొదటి వ్యక్తి కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు కాగా, రెండవ నిందితుడు దళారిగా వ్యవహరించిన వ్యక్తిగా గుర్తించారు.

రెండు కిడ్నీల మార్పిడికి శస్త్ర చికిత్సలు.. విశాఖలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు రాజశేఖర్, దళారి వెంకటేశ్వరరావును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో.. పెందుర్తిలోని శ్రీ తిరుమల ఆసుపత్రిలో చెన్నైకు చెందిన వైద్యుడు రాజశేఖర్.. రెండు కిడ్నీల మార్పిడికి శస్త్ర చికిత్సలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుడు రాజశేఖర్.. హైదరాబాద్‌‌లోని కామినేని ఆస్పత్రిలో పనిచే‌స్తున్నారని.. రాజశేఖర్ ఆపరేషన్‌కు రూ.5 లక్షలు, పర్యవేక్షణ చేస్తే రూ. 3 లక్షలు వసూలు చేసేవారని పేర్కొన్నారు. ఆయన కదలికలపై నిఘా పెట్టి, విశాఖలోనే అరెస్టు చేశామని వెల్లడించారు. రెండవ నిందితుడు.. తూర్పు గోదావరి జిల్లా కరపకు చెందిన దళారి వెంకటేశ్వరరావు ఆర్థిక ఇబ్బందుల్లోని కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దందాకు నడిపిస్తున్నారని వివరించారు. గతంలో శ్రద్ధ ఆస్పత్రిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్‌లోనూ వెంకటేశ్వరరావు నిందితుడుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

ఆపరేషన్‌కు రూ.5, పర్యవేక్షణకు రూ. 3 లక్షలు.. సీఐ గొలగాని అప్పారావు మాట్లాడుతూ..''కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశాం. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి, కిడ్నీ శస్త్ర చికిత్స చేసిన వైద్యుడు రాజశేఖర్ పెరుమాళ్ల, బ్రోకర్ వెంకటేశ్వరరావులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించాం. పెందుర్తి శ్రీ తిరుమల ఆస్పత్రిలో ఇటీవల ఆక్రమంగా రెండు కిడ్నీ శస్త్ర చికిత్సలు జరిగాయి. దీనిపై కేసు నమోదు చేసి.. ఆపరేషన్ చేసిన వైద్యులపై దృష్టి సారించాం. ఇప్పటికే అరెస్టు చేసిన నిందితుల నుంచి సేకరించిన సమాచారం మేరకు చెన్నైకు చెందిన వైద్యుడు రాజశేఖర్ పెరుమాళ్ల ఈ శస్త్రచికిత్సలు చేసినట్టు గుర్తించాం. మల్టీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ అయిన రాజశేఖర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఆయనకు కిడ్నీ మార్పిడిలో విశేష అనుభవం ఉంది. విదేశాల్లో కూడా పని చేశారు. ఈ క్రమంలోనే శ్రీ తిరుమల ఆస్పత్రిలో రెండు కిడ్నీ ఆపరేషన్లు చేశాడు. రాజశేఖర్.. ఆపరేషన్‌కు రూ.5 లక్షలు, పర్యవేక్షణ చేస్తే రూ. 3 లక్షలు వసూలు చేసేవారు. ఆయన కదలికలపై నిఘా పెట్టి నగరంలోనే అరెస్టు చేశాం.

మరో కీలక నిందితుడు, బ్రోకర్‌గా వ్యవహరించిన వెంకటేశ్వరరావును కూడా అరెస్టు చేశాం..ఇతడు తూర్పు గోదావరి జిల్లా కరపకు చెందిన వ్యక్తి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దందాకు తెరతీస్తుంటాడు. ఒక ముఠాను ఏర్పరచుకుని కిడ్నీ రాకెట్ నిర్వహించేవాడు. గతంలో నగరంలోని శ్రద్ధ ఆస్పత్రిలో వెలుగు చూసిన కిడ్నీ రాకెట్‌లోనూ ఇతుడు నిందితుడు. ఈ కేసులో ఇప్పటికే శ్రీతిరుమల ఆస్పత్రి వైద్యుడు జి.పరమేశ్వరరావు, దళారులు కామరాజు, శ్రీను, శేఖర్, ఎలీనా, కొండమ్మలను అరెస్టు చేశాం'' అని ఆయన అన్నారు.

అసలేం జరిగిందంటే.. విశాఖ కేంద్రంగా గతకొన్ని నెలలుగా నిరుపేదలు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయకులను టార్గెట్ చేసి.. వారికి ముందుగా కొంత డబ్బులు ఇచ్చి.. మాయమాటలతో మోసగించి.. శరీరంలోని అవయవాలను కాజేసి అమ్ముకుంటున్నారు. అందులో నగరానికి చెందిన ఇలియానా, అమె తనయుడు అజయ్, మరో వ్యక్తి కామరాజు ముగ్గురూ ఓ ముఠాగా ఏర్పడి.. పేదల కాలనీలలో ఉన్నవారిపై దృష్టిపెట్టి.. కిడ్నీ రాకెట్‌ నడిపించారు. పేదలను వారికున్న ఆర్థిక పరిస్ధితులను ఆసరాగా చేసుకుని పెద్ద మొత్తంలో డబ్బుల ఆశ చూపారు. కిడ్నీలు ఇచ్చేలా లొంగదీసుకున్నారు. దీంతోపాటు కొంతమంది మహిళలను అద్దె గర్భం కోసం బెదిరించారు. ఈ క్రమంలో మధురవాడ వాంబే కాలనీకి చెందిన వినయ్‌ కుమార్‌‌ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారం వెలగులోకి వచ్చింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.