ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధ్యాపకుల్లేని చదువులు.. ఆందోళనలో విద్యార్థినులు

By

Published : Mar 27, 2022, 4:40 PM IST

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించేవారు లేరు.. పాఠాలకు సంబంధించిన ప్రయోగాలు చేయడానికి ప్రత్యేక గది లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను నిర్మించారు కానీ.. మౌలిక సదుపాయాల మాటే మరిచిపోయారు. అధ్యాపకుల నియామకం విస్మరించారు. ఏజెన్సీ పాఠశాలల్లో విద్యార్థులు అధ్యాపకులు లేక... సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదవడానికి ఆన్‌లైన్‌ తరగతులపై.. ప్రయోగాలకు ప్రభుత్వ కళాశాలలపై ఆధారపడుతూ.. పబ్లిక్‌ పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారు పాడేరులోని కస్తూర్బా పాఠశాల విద్యార్థులు.

kgbv
kgbv

సర్వ శిక్ష అభియాన్‌ కింద రాష్ట్రవ్యాప్తంగా 221 కస్తూర్బా గాంధీ పాఠశాలలను మూడేళ్ల కిందట ప్రారంభించారు. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలోని 11 మండలాల్లోనూ ఈ పాఠశాలలు ఉన్నాయి. ఇంటర్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఒక్కొక్క గ్రూపులో 40 మంది చొప్పున.. రెండింటిలో 80 మంది ఉంటారు. పాఠశాలలు ప్రారంభించారు కానీ.. మౌలిక సదుపాయాలు కల్పించటంతోపాటు.. పూర్తిస్థాయి అధ్యాపకులను నియమించడంలో మాత్రం అధికారులు విఫలమయ్యారు.

అధ్యాపకుల్లేని చదువులు.. ఆందోళనలో విద్యార్థినులు

పాఠశాల ఉపాధ్యాయులే బోధన: చాలా కస్తూర్బాల్లో జూనియర్‌ లెక్చరర్స్‌ లేక విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇంటర్‌ విద్యార్థులకు పాఠాలు చెప్పే అధ్యాపకులు లేకపోవడంతో.. పాఠశాలలోని 6 నుంచి పదో తరగతి వరకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులే వారికీ చదువు చెబుతున్నారు.

అన్నీ ఒకే రూమ్‌లో:ప్రాక్టికల్స్‌ చేసే ల్యాబ్‌లు లేకుండా ఎలా చదువుకోవాలని సైన్స్‌ గ్రూపుల విద్యార్థులు అంటున్నారు. ఇంటర్‌లోకి వచ్చిన తమకు.. ఇంకా ఏకరూప దుస్తులు ఇవ్వలేదంటున్నారు. తరగతి గది, ప్రయోగ కేంద్రం, డార్మెంటరీ అన్నీ ఒకే రూమ్‌లో నిర్వహిస్తున్నారని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వచ్చే ఏడాదికైనా.. పూర్తిస్థాయి అధ్యాపకులను నియమించాలని.. వసతి గృహలను పూర్తి స్థాయిలో నిర్మించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు ఆమోదం.. రైల్వేశాఖ వెల్లడి

ABOUT THE AUTHOR

...view details