TDP leaders supported lawyers protest in vishaka: విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద, న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మద్దతు పలికారు. న్యాయవాదులకు మద్దతుగా... అయ్యన్న దీక్షా శిభిరంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా... సీఎం జగన్పై విమర్శులు గుప్పంచారు. న్యాయవాదులు న్యాయం కోసం పోరాడడం.. ప్రస్తుత పాలన వైపరిత్యానికి అద్దం పడుతోందని ఆయన అన్నారు. కోర్టు కోర్టుకో న్యాయం.. కోర్టు కోర్టుకో చట్టం అని ఎన్టీఆర్ ఆనాడే సినిమాల్లోనే చెప్పారని అయ్యన్న గుర్తుచేశారు. కోర్టులో సామాన్యులకు సైతం న్యాయం జరగాలని పెద్దల కోరిక.. ఇప్పుడు సామాన్యులకు ఎక్కడ న్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. క్రింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకూ న్యాయం ఎందుకు ఆలస్యం అవుతుందనేదే తన ఆవేదన అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ చంద్రబాబు ఏనాడు తప్పుడు పనులు చేయండి అని చెప్పలేదని అయ్యన్న తెలిపారు.
స్కిల్ డెవలప్మెంట్ పై గుజరాత్ వెళ్లి రమ్మని అప్పుడు కమిటీ వేశామని అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు. ఫైబర్ నెట్ అనేది క్యాబినెట్ నిర్ణయమని అయ్యన్న పేర్కొన్నారు. ఇడుపులపాయలోని ఐఐఐటీలో సైతం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టామని తెెలిపారు. కావాలంటే సీఎం వెళ్లి చూసుకోవాలంటూ పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ పూర్తిగా కక్ష సాధింపు చర్య అని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న అధికారులను ఎందుకు వదిలిపెట్టారంటూ అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. తనపై ఎన్నో కేసులు ఉన్నా... బెయిల్ మీద బయట తిరుగుతున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. జైల్లో చంద్రబాబుకు ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు.. ఆయన పర్సనల్ డాక్టర్ను అనుమతించవచ్చు కదా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.