ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'పాదయాత్రలో అనేక హామీలిచ్చారు.. ఇప్పుడు విస్మరించారు'

By

Published : Dec 28, 2020, 5:06 PM IST

తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు.. సీఎం జగన్ తాను చేసినట్టు ప్రచారం చేసుకోవడం తగదని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన సీఎం జగన్ అనేక హామీలు ఇచ్చి.. ఇప్పుడు విస్మరించారని ఆరోపించారు.

ayyannapatrudu
ayyannapatrudu

రాష్ట్రంలో తెదేపా హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు.. తాను చేసినట్టు సీఎం జగన్ ప్రచారం చేసుకోవడం తగదని తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. ముఖ్యమంత్రి మాటలు ఎవరూ విశ్వసించరని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు ధరల పెరుగుదలను నిరసిస్తూ.. విశాఖ జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

రాష్ట్రంలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఖర్చుల విషయంలో సరైన అవగాహన లేక ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర చేసిన సీఎం జగన్ అనేక హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details