ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఏయూ వీసీ​పై చర్యలు తీసుకోవాలి: టీడీపీ, సీపీఐ డిమాండ్

By

Published : Feb 20, 2023, 4:59 PM IST

Complaint against AU Vice Chancellor: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్​పై.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏయూ వీసీ.. రాజకీయ సమావేశాలు నిర్వహించడం, స్వయంగా హాజరుకావడంపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సమావేశాలు నిర్వహిస్తున్న అధికారులపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్‌ చేశారు.

Graduate MLC Elections
Graduate MLC Elections

Complaint against AU Vice Chancellor: వైసీపీ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సమావేశాల్ని నిర్వహిస్తూ అధికారాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్న ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతి(వీసీ) పీవీజీడీ ప్రసాద్ రెడ్డిపై, కడప ఆర్జేడీ(పాఠశాల విద్య) ప్రతాప్​రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, వైసీపీ తొత్తులా వ్యవహరిస్తున్న వీసీ ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విశాఖ దసపల్లా హోటల్లో వైసీపీ ఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం నిర్వహించిన సమావేశానికి వీసీ ఎలా హాజరయ్యారంటూ నిలదీశారు. పక్కాగా రాష్ట్రవ్యాప్తంగా అటు ఉపాధ్యాయ ఎన్నికలు, పట్టభద్రుల ఎన్నికల్లో ప్రసాద్ రెడ్డికి బాధ్యతలిచ్చి ఎలాగైనా ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గెలవాలనే లక్ష్యంతో అధికార పార్టీ ఉందని ధ్వజమెత్తారు. తక్షణమే వీసీ ప్రసాద్ రెడ్డిని సస్పెండ్ చేయాలని, ఒక్క క్షణం కూడా కడప ఆర్జేడీని కొనసాగించడం తగదని, వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

ఏయూ వైస్ ఛాన్సలర్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలి.. టీడీపీ, సీపీఐ డిమాండ్

ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్ ప్రసాద్‌రెడ్డి గారు ఆయన ముందు నుంచి కూడా వైసీపీ కార్యకర్తలానే పని చేస్తున్నారు. విశాఖ దసపల్లా హోటల్లో వైసీపీ ఇన్చార్జ్ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం నిర్వహించిన సమావేశానికి వీసీ వెళ్లారంటే ఇంత దారుణం ఏ రోజైనా ఉందా .- రామకృష్ణ,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

టీడీపీ ఫిర్యాదు:ఏయూ వైస్ ఛాన్సలర్ పీవీజీడీ ప్రసాద రెడ్డిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఏయూ వీసీ క్యాంపస్​లో రాజకీయ సమావేశాలు నిర్వహించడం, స్వయంగా పాల్గోనటంపై సీఈఓకు టీడీపీ నేతలు నక్కా ఆనంద్ బాబు, అశోక్ బాబు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు వినతిపత్రం ఇచ్చారు.

ప్రసాద్‌రెడ్డి వైస్‌ ఛాన్స్‌లర్ అయిన దగ్గర నుంచి ఏయూ వైసీపీ కార్యాలయంలా పని చేస్తోంది. అందులో పని చేసే వాళ్లు అందరూ అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. కాలేజీలు, స్కూళ్లకు సంబంధించిన ప్రైవేట్ మేనేజ్​మెంట్​ను వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యన్నారాయణ పిలిచి వైసీపీలో అధికారంలో ఉన్న వాళ్లంతా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ హోటల్​లో మీటింగ్​ పెడితే దానికి వైస్‌ ఛాన్స్‌లర్ స్టేజిపై కూర్చొని రాజకీయ ఉపన్యాసం చెప్పి ఓట్లు వెయ్యాలని బెదిరిస్తున్నారు.- నక్కా ఆనందబాబు, టీడీపీ నేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details