ఆంధ్రప్రదేశ్

andhra pradesh

concern: 'జగనన్న పథకాలేవీ మాకోద్దు.. మా పిల్లల్ని చదువుకోనిస్తే చాలు'

By

Published : Oct 25, 2021, 2:34 PM IST

విశాఖలో సెక్రెడ్‌ హార్ట్‌ ఎయిడెడ్ బాలికోన్నత పాఠాశాల మూసివేతపై.. విద్యార్థులు, తల్లితండ్రులు రోడ్డెక్కారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా.... రోడ్డుపై భైఠాయించారు. జ్ఞానాపురం రహదారిని దిగ్భందించారు. జగనన్న పథకాలేవీ తమకు వద్దని.. పిల్లల్ని చదువుకోనిస్తే చాలని నినాదాలు చేశారు.

concern
concern

'జగనన్న పథకాలేవీ మాకోద్దు..పిల్లల్ని చదువుకోనిస్తే చాలు'

విశాఖ జ్ఞానాపురంలో ఉన్న సెక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ బాలికోన్నత పాఠశాలను మూసివేతపై విద్యార్థులు, వారి తల్లితండ్రుల ఆందోళన చేపట్టారు. జ్ఞానాపురం రహదారిని దిగ్భంధం చేసిన తల్లిదండ్రులు.. ప్రభుత్వ తీరును ఖండిస్తూ రోడ్డుపై భైఠాయించారు. జగనన్న పథకాలేవీ తమకు వద్దని.. పిల్లల్నిచదువుకోనిస్తే చాలు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇలా అర్ధాంతరంగా పాఠశాలను మూసివేస్తే తమ పిల్లల భవిష్యత్ ఏంటి? అని ప్రశ్నించారు. విద్యాసంవత్సరం మధ్యలో ఉండగానే పాఠశాలను మూసివేయాలనుకోవడం దుర్మార్గపు చర్యగా తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.

దాదాపు 30 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో జ్ఞానాపురం, కంచరపాలెం, అల్లిపురం, రైల్వే న్యూకాలని, కొబ్బరితోట, పూర్ణామార్కెట్ ప్రాంతాలకు చెందిన వేల మంది పేద విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. సెయింట్ పీటర్ మిషనరీస్ సంస్థ, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నిర్వహించబడుతుంది. కరోనా కారణంగా ఉపాధి, చిన్న చిన్న వ్యాపారాలు కోల్పోయిన ప్రజలకు ఇప్పుడు ఈ ఎయిడెడ్ పాఠశాల తొలగింపు ప్రక్రియ మరింత భారాన్ని కలిగిస్తుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:Fireworks explosion: భారీగా బాణసంచా తయారీలో పేలుడు... ఒకరు మృతి!

ABOUT THE AUTHOR

...view details